ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమను నాశనం చేయాలని కోరుకుందని, అందులో అది విజయం సాధించిందని ఫ్యూచర్ రిటైల్ సంస్థ సుప్రీంకోర్టులో ఆమోదం ఆవేదన వ్యక్తం చేసింది. రిలయన్స్ ఇండ్రస్టీస్ లిమిటెడ్‌తో ప్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెజాన్ వ్యతిరేకించింది.
దీంతో అమెజాన్, ప్యూచర్ గ్రూప్ రిటైల్ లిమిటెడ్ మధ్య విభేదాలు తలెత్తగా, వీటి మధ్య చర్చలు కూడా విఫలమయ్యాయి. కాగా, రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కిశోర్ బియాని నేతృత్వంలోని వందలాది ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లను సదరు సంస్థ కైవసం చేసుకుంది.
చెల్లించని అద్దెలు రూ. 4800 కోట్లకు పెరగడంతో స్టోర్లను అప్పగించినట్లు పేర్కొంది. కాగా, రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్స్ మధ్య జరిగిన ఒప్పందం మోసపూరితమని అమెజాన్ పేర్కొనగా, దీనిపై ఫ్యూచర్ సంస్థ స్పందించింది.
‘అమెజాన్-ప్యూచర్ వివాదాస్పద ఒప్పందం విలువ రూ. 1400 కోట్లు కాగా, అమెజాన్ రూ. 26 వేల కోట్ల విలువ చేసే కంపెనీని నాశనం చేసింది. అమెజాన్ ఏం చేయాలనుకుందో అందులో విజయవంతమైంది. మేము ఓ త్రాడుకు వేలాడుతున్నాం. ఇప్పుడు మాతో ఎవ్వరూ బిజినెస్ చేయాలనుకోవడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
`యజమాని ఖాళీ చేయాలని నోటీసు వచ్చినప్పుడు.. ఏం చేస్తాం..?(రిలయన్స్‌ను ఉద్దేశించి), 835 స్టోర్లను ఇప్పటికే కోల్పోయాం. మిగిలిన 374 స్టోర్లను అలా నడుపుకొస్తున్నాం’ అని ఫ్యూచర్ రిటైల్ తెలిపింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది.