తమ పార్టీలో ఉంటూ బిజెపితో సన్నిహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి ఆర్‌సిపి సింగ్‌ను మూడోసారి రాజ్యసభకు పంపకుండా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అధికార మిత్రపక్షం బిజెపికి ఝలక్ ఇచ్చారు. బిజెపి ధోరణితో విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెడియు పార్టీ నుండి ఆర్ సిపి సింగ్ ఒక్కరే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు.
అదే పార్టీ తరపున రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం జూన్‌తో ముగియనుంది. మూడోసారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆర్‌సిపి సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే తనకు జులై వరకు పదవీకాలం ఉన్నదని, మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంలో ప్రధానిని కలసి, ఆయన సలహాను పాటిస్తానని చెప్పడం ద్వారా ఇక పార్టీతో తనకు సంబంధం లేదన్న సంకేతం సింగ్ ఇచ్చారు. సింగ్ ను మంత్రివర్గంలో కొనసాగించేటట్లు చూడడం కోసం బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చింది.
అతనికి తిరిగి రాజ్యసభ సీట్ ఇవ్వమని నితీష్ వద్దకు రాయబారం కూడా పంపింది. సింగ్ ను బీజేపీలో చేర్చుకొని, తమ పార్టీ నుండి రాజ్యసభకు పంపడానికి సిద్ధంగా ఉన్నప్పటికి వచ్చే రెండు నెలల్లో జరుగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ప్రభావం చూపగలదని వెనుకడుగు వేసిన్నట్లు చెబుతున్నారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సింగ్ ఢిల్లీలో పెంచుకున్న ప్రాబల్యాన్ని కట్టడి చేయడం కోసం ఆయనకు బదులుగా పార్టీలో పెద్దగా ప్రాబల్యం లేని జార్ఖండ్ అధ్యక్షుడు ఖిరు మహతోను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసి అందరిని ఆశ్చర్య పరచారు. ఒకప్పుడు పార్టీలో తిరుగులేని నేతగా, నితీష్ తర్వాత నెంబర్ టూగా పేరొందిన మాజీ ప్రభుత్వ అధికారి సింగ్ ను చాలామంది ఆయనకు వాసరసుడిగా భావించారు.
అయితే పార్టీలో తామే అధికులమని భావించినవారిని నితీష్ వ్యూహాత్మకంగా కట్టింది చేసిన వారి జాబితాలో ఇప్పుడు చేరిపోయారు. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రులు, అగ్రశ్రేణి సోషలిస్ట్ నేతలు జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, దిగ్విజయ్ సింగ్ వంటి వారు ఉన్నారు.
నితీష్ సన్నిహితుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఉపేంద్ర కుష్వాహ కూడా 2007లో విభేదాల కారణంగా ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. తిరిగి 2009లో జేడీయులోకి తిరిగి వచ్చినా, 2013లో విడిచిపెట్టి తన స్వంత పార్టీని ఏర్పరచుకొన్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత ఏడాది తిరిగి మాతృ పార్టీలో చేరారు.
జెడియు వర్గాల కధనం ప్రకారం, సింగ్ ఢిల్లీలో కేంద్ర బిజెపి నాయకత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ, సొంత పార్టీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ప్రతిపాదిత జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ ఆర్ సి), బీహార్‌కు ప్రత్యేక హోదా వంటి అంశాలపై పార్టీ వైఖరిని పలుచన చేసినందుకు మూల్యం చెల్లించుకున్నారని చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లో బీజేపీతో జేడీయూ విభేదిస్తూ వస్తున్నది.
ఫెర్నాండెజ్ నితీష్ కు రాజకీయ గురువు. కానీ అది పార్టీలో అనుభవజ్ఞుడైన సోషలిస్టు ప్రభావాన్ని తగ్గించడానికి 2004లో శరద్ యాదవ్‌ను జెడియు అధ్యక్షుడిగా చేయడాన్ని అడ్డుకోలేదు. 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫెర్నాండెజ్‌తో ముఖ్యమంత్రి సంబంధం మరింత క్షీణించింది. మాజీ కేంద్ర మంత్రి ముజఫర్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ఫెర్నాండెజ్ 1977లో ముజఫర్‌పూర్‌లో జైలు నుంచి గెలుపొందారు.
కానీ నితీష్ ఆయనకుకి టిక్కెట్ నిరాకరించారు. కోపోద్రిక్తుడైన ఫెర్నాండెజ్ కొద్దిమంది మద్దతుదారులతో జేడీయుని విడిచిపెట్టి స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. కొన్ని నెలల తర్వాత, జెడియు ఫెర్నాండెజ్‌ను రాజ్యసభకు వెళ్లమని ఒప్పించింది. అతనిపై అభ్యర్థిని నిలబెట్టలేదు. 2019 జనవరిలో ఫెర్నాండెజ్ ఢిల్లీలో మరణించారు.
బీహార్ మాజీ సిఎం, జనతా పార్టీ అగ్రనేత కర్పూరీ ఠాకూర్‌కు నితీష్ కుమార్‌ను తానే పరిచయం చేశానని చెప్పుకునే యాదవ్, జూలై 2017లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లోకి తిరిగి రావాలనే నిర్ణయంపై ఆయనతో విభేదించారు. దానితో అనర్హత పిటీషన్ తో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని నితీష్ రద్దు చేయించగలిగారు. యాదవ్ కొన్ని నెలల క్రితమే ఆర్జేడీలో చేరారు.