అమరవీరుల ఆకాంక్షలను వాస్తవం కావించి, కుటుంభ, అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలమని ప్రజలను ఒప్పించడం ద్వారా తెలంగాణాలో తగిన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగింది బిజెపి మాత్రమే అని హైదరాబాద్ లో రెండు రోజులపాటు జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు స్పష్టం చేశాయి.
తెలంగాణలోని పరిస్థితులపై ప్రత్యేకంగా సమావేశాలు ఆమోదించిన ఓ ప్రకటనలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక, సామజిక, మానవ అభివృద్ధి వంటి అన్ని సూచికలలో తీవ్రమైన క్షీణత వ్యక్తం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రం ఇటువంటి నీచమైన అధోగతికి చేరుకోవడం గతంలో ఎన్నడూ ఎరుగదని తెలుపుతూ అందుకు పూర్తి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది.
తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నదని పేర్కొంటూ 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు, టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోగా, ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుందమొ గుర్తుజి సీజేసోందో. 2018 ఎన్నికలలో పొందిన ఓట్లకన్నా చాలా ఎక్కువగా బిజెపి 19.45 ఓట్లు సాధించుకుందని తెలిపింది.
అయితే, దేశ వ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోదీ ప్రభంజనం అందుకు ప్రధాన కారణం అయినా, అక్టోబర్/నవంబర్ 2020లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన మేనల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మధ్య ఉన్న ప్రాంతంలో బిజెపి తిరుగులేని విజయం సాధించిందని తెలిపింది. ఆ తర్వాత 2020 డిసెంబర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం రాజకీయ పండితులను సహితం ఆశ్చర్యపరిచిందని వివరించింది.
150 సీట్లు ఉన్న కార్పొరేషన్లో 48 సీట్లను బిజెపి గెల్చుకొంది. అంతకు ముందు బి.జె.పిలో కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల పరంగా చూస్తే దాదాపుగా టీఆర్ఎస్ తో సమంగా వచ్చాయి. జీహెచ్ఎంసీ లో బిజెపి సాధించిన విజయాల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీలలో ఎవరన్న ఊహాగానాలను తోసిపుచ్చి బిజెపి ఒక్కటి మాత్రమే అని నిలిచిందని జాతీయ కార్యవర్గం స్పష్టం చేసింది.
ఇక 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో టీఆర్ఎస్ భవితవ్యానికి తెర వేసిందని బిజెపి వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ పరిస్థితి విషమంగా మారిందని, ఎన్నికలను ప్రతిష్టాకరంగా తీసుకొని విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ బీజేపీ అఖండ విజయాన్ని సాధించిందని వివరించింది.
బీజేపీ ఎదుగుదల అధినేత(కేసీఆర్)కు కంటిమీద కునుకు లేకుండా చేయడంతో, కేంద్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు ప్రారంభించారని బిజెపి ధ్వజమెత్తింది. పైగా, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించి, రెండు దశలు ఇప్పటికే పూర్తయిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందని, ప్రజల నుండి విపరీతమైన మద్దతు లభించడంతో అభద్రతా భావంతో ఉన్న ముఖ్యమంత్రిని మరింత కలవరపరిచిందని తెలిపింది.
నిజానికి చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి భాష చౌకబారుగా, అభ్యంతకరంగా, అసహ్యకరంగా, ముఖ్యమంత్రికి తగనిదిగా ఉంటున్నదని బిజెపి కార్యవర్గం విమరిస్సానుంచింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరుల నిరాశ రాష్ట్రంలో బిజెపి బలపడుతోందన్న వాస్తవాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందనిదులిపింది. కేవలం దేశం కోసం మాత్రమే పనిచేసే డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ప్రజల పోరాటానికి అర్థాన్ని ఇవ్వగలదని కూడా స్పష్టం చేసింది.
ఈ పరిస్థితుల్లో దేశంలోనే `నేషన్ ఫస్ట్’ లక్ష్యంతో చేస్తూ అవినీతి లేని, కుంభకోణాలు లేని పాలన అందిస్తున్న బి.జె.పి మాత్రమే
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అంచనాలను అర్ధం చేసుకోగలదని తెలిపింది.