టీఆర్ఎస్, కాంగెర్స్ పార్టీ లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించాయిరు. ప్రస్తుతం మంచి రోజులు లేవని, ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయని ఆయన చెప్పారు.
టీఆర్ఎస్ లోని సహచరులతో తనకు 20 ఏళ్ళ అనుబంధం అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తనతో టచ్లో ఉన్నారని తెలిపారు. తమ పంచాయితీ కేసీఆర్తో మాత్రమేనని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని తాను కాస్త ముందుగా ఎదిరించానని, అదే బాటలో నడిచేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని చాలామంది ఇప్పుడే బహిర్గతం కాలేకపోతున్నారని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధంగా ఉందని చెప్పారు.
కాగా, ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని ఈటెల కొనియాడారు. మోదీకి అండగా నిలిచేందుకు, బీజేపీ జెండా ఎగురవేసేందుకు యువత, రైతులు, మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నారని అయన పేర్కొన్నారు.
తెలంగాణాలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకు పోతుందని చెబుతూ జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాదే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఈటెల గుర్తు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్, 57 ఏళ్లకే పెన్షన్, రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఓడిపోతే తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడరని తేల్చి చెప్పారు.
బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో కేసీఆర్పై పోటీ చేసి ఓడిస్తానని ఈటెల ధీమా వ్యక్తం చేశారు.క, కాంగ్రెస్ ది డంబాచారమే తప్ప.. కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి ఆ పార్టీకి లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తమ పార్టీలో చేరవచ్చని పేర్కొన్నారు.