మునుగోడు లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని, పోలీసులు, డబ్బును నమ్ముకుని గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని..ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని బిజెపి ఎమ్యెల్యే, మాజ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా స్థానిక నేతలు కట్టలు తెంచుకుని కాషాయ కండువా కప్పుకుంటారని ఆయన తేల్చి చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తూ, ఎవరికీ వారే గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ శనివారం భారీ సభ నిర్వహిస్తుండగా, బిజెపి ఆదివారంసభ నిర్వహించబోతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం సమావేశాలు , ప్రచారంలో మునిగిపోయింది.
ఈ నెల 21 న బిజెపి అమిత్ షాతో సభ ఏర్పటు చేస్తున్నట్లు కొద్దీ రోజుల క్రితమే ప్రకటించగా, వెంటనే కేసీఆర్ తేరుకొని ఓ రోజుముందే అక్కడ సభ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకే ఆగమేఘాల మీద మునుగోడులో సీఎం సభ ఏర్పాటు చేశారని రాజేందర్ ఆరోపించారు.
\టీఆర్ఎస్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ పార్టీని ఓడించాలని మునుగోడు ప్రజలు నిర్ణయించుకున్నారని ఈటల స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోలీసులు, డబ్బును నమ్ముకుని మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఈటల విమర్శించారు.
ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా స్థానిక నేతలు కట్టలు తెంచుకుని కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అక్రమాలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని ఈటల ఆరోపించారు.