బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బల పరీక్షలో నితీష్ సారథ్యంలోని మహా కూటమి సర్కార్కు 160 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు.
2024లో తానేంటో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. 2024లో బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలన్నీ కలిసివచ్చి మద్దతిచ్చినందుకు నితీశ్ ధన్యవాదాలు తెలిపారు.
వాజ్పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవని పేర్కొన్నారు. బల పరీక్షలో నితీష్ సర్కార్కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. 2017లో తేజస్వీ యాదవ్పై విబీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీశ్ ఆగస్ట్ 10న ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్జేడీకి 16, జేడీయూకు 11 మంత్రిపదవులు దక్కాయి. మర్శలు చేశారని, ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు.
ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేయడం బీజేపీ ఫార్ములా అని ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ఆర్జేడీ-జేడీయూ కొత్త భాగస్వామ్యం చారిత్రాత్మకమని తెలిపారు. తమ భాగస్వామ్యం సుదీర్ఘ కాలం నిలవనుందని, దీనిని ఎవరూ పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
ఇలా ఉండగా, తొలుత బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న విజయ్ కుమార్ సిన్హా చివరికి మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారు.
రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు.