సెప్టెంబర్ 29, 30 తేదీలలో గుజరాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సూరత్ లో రూ. 3,400 కోట్కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని ప్రజల అంకితం కూడా చేస్తారు. ఆ తరువాత భావ్ నగర్ లో మధ్యాహ్నం పూట 2 గంటలకు రూ. 5,200 కోట్లకు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
ముప్ఫై ఆరో జాతీయ క్రీడలను రాత్రి దాదాపు 7 గంటలకు అహమదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియమ్ లో ప్రారంభించనున్నారు. రాత్రి 9 గంటలకు అహమదాబాద్ లోని జిఎండిసి మైదానం లో నవరాత్రి ఉత్సవాలలో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు.
గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు సెప్టెంబర్ 30న సుమారు 10:30 గంటలకు గాంధీ నగర్ స్టేశన్ లో ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండాను చూపడంతో పాటుగా ఆ రైలులో బయలుదేరి కాలుపుర్ రైల్ వే స్టేశన్ వరకు ప్రయాణిస్తారు. ఉదయం సుమారు 11:30 గంటలకు అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రారంభ సూచక జెండాను చూపిన తరువాత, కాలుపుర్ స్టేశన్ నుండి మెట్రోలో బయలుదేరి దూర్ దర్శన్ కేంద్ర మెట్రో స్టేశన్ వరకు ప్రయాణించనున్నారు.
మధ్యాహ్నం సుమారు 12 గంటలకు అహమదాబాద్ లోని అహమదాబాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ లో ఏర్పాటైన ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొని, అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు ఒకటో దశ ను ప్రారంభిస్తారు. అటు తర్వాత సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు అంబాజీలో రూ. 7,200 కోట్లకు పైగా విలువ కలిగిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసి, వాటిని ప్రజలకు అంకితం చేయనున్నారు.
రాత్రి 7 గంటలకు ప్రధాన మంత్రి అంబాజీ దేవాలయంలో దైవదర్శనం చేసుకొని, 7.45 గంటలకులు గబ్బర్ తీర్థ లో జరిగే మహా ఆరతి కార్యక్రమానికి హాజరు కానున్నారు.