ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ను ప్రారంభించి, కాలూపుర్ స్టేశన్ నుండి మెట్రో లో దూర్ దర్శన్ కేంద్ర మెట్రో స్టేశన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నరు ఆచార్య దేవవ్రత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింహ్ పురిలు కూడా ఉన్నారు.
మెట్రో లో ప్రయాణించినపుడు విద్యార్థులతో, క్రీడాకారులతో, సాధారణ ప్రయాణికులతో ప్రధాన మంత్రి మాట్లాడారు. మెట్రో రైలులో ఉన్న అనేక మంది ప్రయాణికులు ప్రధాన మంత్రి ఆటోగ్రాఫ్ ను కూడా తీసుకొన్నారు.
అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు బహుళ విధ మౌలిక సదుపాయాల సంబంధిత సంధానానికి గొప్ప ప్రోత్సాహాన్ని అందించేది అని చెప్పాలి. అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు యొక్క ఒకటో దశ లో అపేరల్ పార్క్ నుండి థల్ తేజ్ వరకు ఈస్ట్ -వెస్ట్ కారిడోర్, మొటేరా నుండి గ్యాస్ పుర్ మధ్య నార్థ్-సౌథ్ కారిడోర్ కు చెందిన సుమారు 32 కిలో మీటర్ ల భాగం కలసి ఉంది.
ఈ ప్రాజెక్టు తాలూకు ఒకటో దశను రూ. 12,900 కోట్లకు పైబడిన ఖర్చు తో నిర్మించారు. అంతకు ముందు, ప్రధాని మోదీ గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు గాంధీనగర్ స్టేషన్ లో ఆకుపచ్చ జెండాను చూపించి ప్రారంభించారు. అక్కడి నుండి కాలూపుర్ రైల్ వే స్టేషన్ వరకు అదే రైలు లో ఆయన ప్రయాణించారు.
గాంధీనగర్, ముంబయిల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 గేమ్ చేంజర్ గా నిరూపణ కాగలదు. అంతేకాకుండా భారతదేశంలోని రెండు ప్రధాన వ్యాపార కేంద్రాల మధ్య కనెక్టివిటీకి ప్రోత్సాహాన్ని కూడా అందించగలదు. దీనితో గుజరాత్ లో వ్యాపార సంస్థల యజమానులకు ముంబయికి వెళ్ళేటప్పుడు, అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పునడు విమానయానాన్ని పోలిన సౌకర్యాలు దక్కగలవు.
గాంధీనగర్ నుండి ముంబయి వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలు ద్వారా ఒక వైపు ప్రయాణానికి ఇంచుమించు 6-7 గంటల సమయం పట్టవచ్చని అంచనా. దీనిలో దేశీయంగా అభివృద్ధి పరచిన ట్రైన్ కలిఝన్ అవాయిడన్స్ సిస్టమ్ – ‘కవచ్’ సహా ఉన్నత అత్యాధునిక సురక్ష సౌకర్యాలను జతపరచారు.