దేశంలో పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా ఆరోసారి టాప్‌లో నిలిచింది. సూరత్, ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే వివరాలను శనివారం విడుదల చేశారు.
‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో రాణించాయి. పెద్ద నగరాల కేటగిరిలో ఇండోర్, సూరత్ అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ దానిని కోల్పోయింది. ఆ స్థానాన్ని నవీ ముంబై దక్కించుకుంది.
కాగా, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం నాలుగో స్థానంలో, విజయవాడ ఐదో స్థానంలో ఉన్నాయి. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ ఆరో స్థానంలో, తిరుపతి ఏడో స్థానంలో, మైసూర్ ఎనిమిదో స్థానంలో, దేశ రాజధాని న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ పదో స్థానంలో నిలిచాయి.
శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది.రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి.కోరుట్ల మున్సిపాలిటీకి లభించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ నుంచి మంత్రి కేటీఆర్ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, కమిషనర్ అయాజ్ అందుకున్నారు.