మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరింత కాలం బతికి ఉంటే గోవాకు ఇంకాస్త ముందుగానే విముక్తి కలిగేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. డిసెంబర్ 19న ‘గోవా విమోచన దినం’ సందర్భంగా గోవా రాజధాని పనాజీలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటూ స్వాతంత్య్రం కోసం గోవా ప్రజలతో పాటు, దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు సుదీర్ఘకాలం పోరాడారని గుర్తు చేశారు.
‘‘సర్దాద్ వల్లభాయ్ పటేల్ మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవాకు విముక్తి ఇంకా ముందుగానే లభించేది. మహారాష్ట్రలోని మరఠ్వాడాతో పాటు నిజాం పాలనను తప్పించిన పలేట్.. గోవాకు కూడా విముక్తి కల్పించేవారు. ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు గోవా విముక్తి కోసం కూడా పోరాడేవారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఎంతో కాలానికి కానీ గోవాకు విముక్తి లభించలేదు’’ అని మోదీ విచారం వ్యక్తం చేశారు.
మోదీ తన రోమ్ పర్యటనను గుర్తు చేసుకుంటూ ‘‘కొద్ది రోజుల కిందట నేను ఇటలీకి వెళ్లాను. నాకు అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకునే అవకాశం లభించింది. ఆయనను ఇండియాకు రావాలని కోరాను. దానికి ఆయన సమాధానమిస్తూ ‘ఇది నాకు అత్యంత పెద్ద బహుమతి’’ అని అని చెప్పారు. ఇది భారత ప్రజాస్వామ్య గొప్పతనం, ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వంలోని విశిష్ట లక్షణం’’ అని మోదీ తెలిపారు.
సుపరిపాలనతో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతిని కొనియాడుతూ సుపరిపాలనతో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతి చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ని చొస్తే ఈ రాష్ట్ర (గోవా) ప్రజలు ఎంత నిజాయితీపరులో, ప్రతిభావంతులో, ఎలా కష్టపడుతారో దేశం మొత్తం చూసిందని ప్రధాని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి తన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడుతాడనే విషయాన్ని మనం మనోహర్ పారికర్ జీవితం ద్వారా చూశామని చెబుతూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.