ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించేమన్కీ బాత్ మనసులో మాట)లో భాగంగా ఇవాళ రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడిన మోదీ తెలంగాణ ప్రస్తావన తేవడం విశేషం. సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న తనకు జీ-20 లోగోను పంపారన్నప్రధాని ఆ అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.
ఇలాంటి సృజనాత్మకత దేశ ప్రజల్లో ఉత్సాహం, ఎనర్జీని చాటి చెబుతోందని పేర్కొన్నారు. ఈ రోజున దేశంలోని ప్రజలంతా కొత్తగా, ప్రత్యేకంగా ఏదైనా చెయ్యడానికి ఎవరి వంతుగా వారు తమ తమ రంగాల్లో ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఈసారి డిసెంబర్ 1న భారత్ బాధ్యతగా తీసుకోబోయే జీ-20 సదస్సును చక్కగా జరిపేందుకు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మెచ్చుకున్న మోదీ ఇది మనకు గర్వకారణం తెలిపారు. ఈ సదస్సులోని సభ్య దేశాల్లో ప్రపంచంలోని మూడొంతుల జనాభా ఉన్నారన్న మోదీ ప్రపంచంలోని నాలుగింట మూడొంతుల వాణిజ్యం ఈ దేశాల్లోనే జరుగుతోంది పేర్కొన్నారు. ప్రపంచ జీడీపీలో 80 శాతం ఈ దేశాలదేనని తెలిపారు.
జీ-20 సదస్సును నిర్వహించబోతుండటం గర్వంగా ఉందని దేశవ్యాప్తంగా ప్రజలు తనకు లేఖలు పంపుతున్నారన్న మోదీ ఇది భారత్‌కి పెద్ద బాధ్యత చెప్పారు. వాతావరణం, పర్యావరణం, కాలుష్యం ఇలా ఎన్నో ప్రపంచ సమస్యలకు భారత్ సమాధానం ఇస్తోందన్న మోదీ ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్తు థీమ్‌ని ఇచ్చినట్లు తెలిపారు
మరోవినక, నవంబర్ 18న ప్రైవేట్ రాకెట్‌ని విజయవంతంగా నింగిలోకి పంపడం ద్వారా అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృషించిందని ప్రధాని గుర్తు చేశారు. సరికొత్త శకం.. పూర్తి విశ్వాసంతో మొదలైందని చెప్పారు.
యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఇండియన్ మ్యూజిక్ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని కొనియాడారు. భారతీయ సంగీత పరికరాలు అనేక దేశాల్లో విక్రయిస్తున్నారని ఆయన వివరించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కినోర్ లో డ్రోన్ల ద్వారా యాపిల్స్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.