బిజెపికి కంచుకోటగా ఒంటి, గత 15 ఏళ్లుగా ఆ పార్టీ ఎన్నికవుతూ వస్తున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 15 ఏళ్లుగా బీజేపీనే కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఆక్రమించుకోగా, తొలిసారి పూర్తిస్థాయి మద్దతుతో ఢిల్లీ కార్పొరేషన్ పీఠాన్ని సొంతం చేసుకుంది
డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 వార్డులకు ఎలక్షన్ జరిగింది. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరిగింది.ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలకి పరిమితం అయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ దగ్గర ఆప్ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా గడిపారు.
958లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 2012లో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేశారు. ఈ ఏడాది మే 22 నుంచి ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. అయితే ఢిల్లీ మున్సిపల్ పీటంపై 15 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉంటుంది.
2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ 48 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగు లేని విజయం కైవసం చేసుకుంది. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ప్రజలకు థ్యాంక్యూ. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మనందరం కలిసి ఢిల్లీని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలి’ అంటూ ట్వీట్ చేశారు.