మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో కశ్మీర్‌కు చెందిన సర్గమ్ కౌశల్ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్‌కు దక్కింది. మిసెస్ వరల్డ్ కిరీటాన్ని సర్గమ్కు ‘2021 మిసెస్ వరల్డ్ విజేత’ షాయలిన్ ఫోర్డ్(అమెరికా) అందజేసింది.
అమెరికాలోని లాస్వేగాస్లో జరిగిన ఈ పోటీల్లో 63 దేశాల మహిళలు పాల్గొన్నారు. మిసెస్ పాలినేషియా తొలి రన్నరప్‌గా.. మిసెస్ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు.
‘‘దాదాపు 21 ఏళ్ల తర్వాత మనకు మళ్లీ కిరీటం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్’’ అని సర్గమ్ కౌశల్ పేర్కొన్నారు. సర్గమ్ ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ పూర్తిచేసి విశాఖపట్నంలో కొంతకాలం టీచర్‌గా పనిచేశారు. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
ఆమె భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి. ఇక వివాహిత మహిళల కోసం ఈ అందాల పోటీలు1984 నుంచి నిర్వహిస్తున్నారు. 2001లో చివరిసారిగా భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు.