ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం పశ్చిమ బెంగాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్ మృతితో ఆయన వర్చువల్గా పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. హావ్డా, న్యూజల్పయ్గురిని కలిసే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
వంద్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయాను, నా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.కోల్ కతాలో జరిగే జాతీయ గంగా మండలి సవేశాన్ి కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్సువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడిన మాటలకు ప్రధాని కదిలించాయి.
‘‘పశ్చిమబెంగాల్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోజు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు” అని చెప్పారు.
“మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ హాజరయ్యారు.
రెండు రోజుల కిందట అనారోగ్యానికి గురైన తల్లి హీరాబెన్ మరణించడంతో ప్రధాని హుటాహుటిన గుజరాత్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో కోల్కతా పర్యటనను రద్దు చేసుకున్నారు.