Author: admin

నియంతృత్వ పోకడలు సాగిస్తున్న కేసీఆర్‌ తీరు నచ్చక బీజేపీలో చేరడానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్‌ తెలిపారు. కొంత మంది తెరాస ప్రజాప్రతినిధులు కమలం గూటికి వచ్చేందుకు రాయబారాలు నడుపుతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరేవారి పూర్తి వివరాలను పరిశీలించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం మునుగోడు వెళుతున్న బండి సంజయ్‌ రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా ఇంట్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే వారిని మాత్రమే చేర్చుకుంటామని.. భూ కబ్జాదారులు, ప్రజల కోసం పనిచేసే నిబద్ధత లేని వారిని పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక మరో గుణపాఠం అవుతుందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు.…

Read More

దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను అప్పగిస్తారా? అని మీడియా అడిగితే పాక్ అధికారి ఏం అన్నాడంటే అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోపాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయూద్‌ను అప్పగిస్తారా అని భారత మీడియా.. పాక్ అధికారిని ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పేందుకు పాక్ అధికారి నిరాకరించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇంటర్‌పోల్ 90వ వార్షిక సర్వసభ్య సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఇవి ఇంటర్‌పోల్ అత్యున్నత పాలక మండలి సమావేశాలు, దాని పనితీరు సమీక్ష మరియు కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రతి సంవత్సరం ఒకసారి కలుస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఇవి దిల్లీలో జరుతున్నాయి.నాలుగు రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో 195 సభ్య దేశాలనుంచి ఆయా దేశాల మంత్రులు, పోలీస్ చీఫ్‌లు, సెక్యూరిటీ ఏజన్సీల అధిపతులు, అత్యున్నత పోలీసు అధికారులు పాల్గొంటున్నారు. 25 ఏళ్ళ తరువాత భారత్ ఈ సమావేశాలకు ఆతిధ్యం ఇస్తోంది. దీనికి పాకిస్తాన్‌కు చెందిన…

Read More

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంతలా పరిపాలన సాగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సరైన నాయకుడు ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొడతారు, కానీ జగన్‌ మాత్రం నోరు ఎత్తిన ప్రతి వారిని అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకం చూడలేదని కన్నా అన్నారు. ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో జగన్‌ చూపిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో పవన్‌ను అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను గౌరవించుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఏం చేశారో చెప్పుకోలేకే ప్రతిపక్ష నేతలను తిడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. చరిత్రలో నరకాసురుడిని చూశామని, అలాంటి జగన్‌ను కూడా ప్రారద్రోలాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రాక్షస పాలన అంతమొందించాలన్నదే…

Read More

ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్ వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవంక, ప్రజలలో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోందని అదే సర్వేలో తేలిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని పేర్కొంటూ గతంలో అమరావతి రాజధానికి మద్దతిచ్చి.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని ధ్వజమెత్తారు. సభలో ఇచ్చిన మాటకు విలువ లేకుండా చేస్తున్నారని పేర్కొంటూ చట్టసభల్లో చేసిన చట్టానికి విలువ లేనప్పుడు వైసీపీకి పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు. ఏపీకి నేడు రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వేల ఎకరాలు వద్దు, చిన్న రాజధాని చాలని ఆ నాడు మిత్రపక్షంగా తెలుగు దేశం ప్రభుత్వంకు తాను చెప్పానని గుర్తు చేశారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని, ఇక్కడే ఇల్లు కట్టానని..…

Read More

మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్‌ఆర్‌ బిడ్డనని, భయం లేదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని హితవు చెప్పారు. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ తాను పులి బిడ్డను అని, తనకు భయం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ బేడీలు తనను ఆపలేవని ఆమె ప్రెస్ మీట్ లో బేడీలు చూపించారు. తనను ఆపడం ఎవరి తరం కాదని అంటూ “మీకు పోలీసులుంటే.. నాతో జనం ఉన్నారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి” అంటూ ఆమె సవాల్ చేశారు.అన్నారు. కేసులు పెట్టారు కదా… అరెస్ట్ చేయండి చూద్దామని ఎద్దేవా చేశారు. తాను బ్రతికినంత కాలం…

Read More

పార్ధసారధి పోట్లూరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనేది కేవలం ఒక ప్రచారం కోసం చేస్తున్న యాత్ర తప్పితే ఇందులో ఇటు దేశానికి గానీ,అటు కాంగ్రెస్ పార్టీకి కానీ చేసే మేలు ఏ మాత్రం ఉండబోదు. భారత్ జోడో యాత్ర అసలే నానాటికీ తీసికట్టు చందంగా తయారవుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమైక్యత మీద విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కాస్త ఉపశమనం కోసం చేస్తున్న యాత్ర. రాజీవ్ తరువాత ఆ కుటుంబం నుండి జరుపుతున్న యాత్ర ఇదే మోదటిసారి! ఇప్పటివరకు ఇలాంటి యాత్ర చేయడానికి సాహసం చేయలేదు భద్రతా కారణాలు చూపించి కానీ గత 8 ఏళ్లుగా బిజేపి పాలనలో ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టడం వలన ధైర్యంగా బయటికి వచ్చి పాదయాత్ర చేయగలుగుతున్నాడు రాహుల్. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు బయటికి వెళ్లిపోతుండడం మీద చెలరేగిన విమర్శల వలన కాస్తంత…

Read More

‘కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌’ నిబంధనను రద్దుచేస్తూ భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు (బిసిసిఐ) చేసిన రాజ్యాంగ సవరణలను సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆమోదించింది. దానితో బీసీసీఐ అధ్యక్షునిగా సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శిగా జై షా మరో మూడేళ్లు కొనసాగే అవకాశం ఏర్పడింది. రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్ల పాలకమండలిలో కొనసాగుతున్నప్పటికీ బిసిసిఐలో వరుసగా రెండుసార్లు పదవుల్లో కొనసాగొచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం ఏ ఆఫీస్‌ బేరర్‌ అయినా రెండుసార్లు వరుస ఆ పదవుల్లో కొనసాగి ఆ తర్వాత తప్పనిసరి విరామం ‘కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌’ తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర సంఘంలోనైనా, బిసిసిఐలోనైనా లేదా రెండింటిలో వరుసగా రెండు దఫాలు (మూడేళ్ల చొప్పున) పదవుల్లో ఉన్న వాళ్లు అదే క్రమంలో మూడో పర్యాయం పదవుల్లో కొనసాగడానికి వీల్లేదు. మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ పోటీ చేయొచ్చు. రాష్ట్రంలో ఒక పర్యాయం, ఆ వెంటనే బిసిసిఐలో ఓ పర్యాయం ఆఫీస్‌ బేరర్‌గా ఉంటే వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉన్నట్లే…

Read More

భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యతనివ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో ఉన్న అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి, అక్కడి జీవన విధానాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి పర్యాటకాల వల్ల ప్రజల మధ్య సంస్కృతి, అభిప్రాయాల మార్పిడి జరిగి జాతి ఐక్యత, సమగ్రత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. “నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్” పేరిట ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించిన 18 రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మహిళలు సహా 75 మంది బైకర్లతో న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడు మంగళవారం సంభాషించారు. ఇటీవలి తన ఈశాన్య రాష్ట్రాల పర్యటనను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, అందమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సంస్కృతి ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక స్వర్గధామం అని ఆయన తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ రంగంలో భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాలను ఆయన అభినందించారు. వారు…

Read More