భారత రాజ్యాంగమే మనకు అన్నివేళలా మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాత దార్శనికత మన గణతంత్ర దేశానికి నిరంతరం మార్గదర్శకంగా పనిచేస్తుందని ఆమె చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకొన్న వారందరినీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుందని పేర్కొన్నారు.
రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడంలో అంబేద్కర్ కీలక భూమిక పోషించారని ఆమె చెప్పారు. గతంలో పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా పరివర్తన చెందిందని ముర్ము గుర్తు చేశారు.
భారత దేశంలో విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ, అవి మనల్ని ఏకం చేశాయే తప్ప ఏనాడూ విభజించలేదని, అందువల్లే మనం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా విజయవంతమయ్యాయని, ఇది భారతదేశ గొప్పతనమని ఆమె వ్యాఖ్యానించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపక్పలనలో పాలుపంచుకొన్న వారందరినీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుందని ఆమె చెప్పారు. గతంలో పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్.. ప్రపంచ వేదికపై ఇప్పుడు ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా పరివర్తన చెందడం వెనుక రాజ్యాంగ నిర్మాతల సమిష్టి మేధాశక్తి ఉన్నది. లేకుంటే ఈ పరివర్తన సాధ్యమయ్యేది కాదని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
పటిష్టమైన పునాదులపై ఆర్థిక వ్యవస్థ నిలబడటంతో మనం పలు ప్రశంసనీయమైన కార్యక్రమాలను ప్రారంభించి, పురోగమించ గలుగుతున్నామని ముర్ము చెప్పారు. ప్రజలంతా వ్యక్తిగతంగానూ, సమిష్టిగానూ, తమ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకుని, అభివృద్ధి చెందగలిగే వాతావరణాన్ని కల్పించడమే అంతిమ లక్ష్యంగా వుండాలని ఆమె సూచించారు.
ఈ ప్రయోజనాల కోసం విద్య సరైన పునాదులు నిర్మిస్తుందని చెబుతూ ఇందుకుగాను నూతన జాతీయ విద్యా విధానం ప్రతిష్టాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆమె గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానం రెట్టింపు విద్యా లక్ష్యాలను ఖచ్చితంగా సూచిస్తుందబి పేర్కొంటూ ఆర్థిక, సామాజిక సాధికారత, సత్యాన్ని అన్వేషించే సాధనంగానూ ఇవి వున్నాయని ఆమె తెలిపారు.
ఈ విధానం మన నాగరికత పాఠాలను సమకాలీన జీవితానికి సరిపడే విధంగా చేస్తుందని, అలాగే 21వ శతాబ్దపు సవాళ్ళకు అభ్యాస ప్రక్రియను తయారు చేస్తుందని ఆమె అభిలాష వ్యక్తం చేశారు. అభ్యాస ప్రక్రియను విస్తరించడం, కూలంకష అధ్యయనం చేయడంలో సాంకేతిక పాత్రను జాతీయ విద్యావిధానంను ఆమె అభినందించారు.
పరిపాలనలో అన్ని అంశాలను మార్చేందుకు, ప్రజల సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన వరుస కార్యక్రమాల ఫలితంగా, ప్రపంచం భారతదేశాన్ని కొత్త గౌరవ భావంతో చూడడం ప్రారంభించిందని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. వివిధ ప్రపంచ వేదికలలో మన దేశ జోక్యం – సానుకూల మార్పులు సృష్టించడం ప్రారంభించిందని ఆమె చెప్పారు.
ప్రపంచ వేదికపై భారతదేశం సంపాదించిన గౌరవం – కొత్త అవకాశాలు పొందడంతో పాటుగా, బాధ్యతలను కూడా కలిగి వుందని ఆమె స్పష్టం చేశారు ఈ ఏడాది భారతదేశం – గ్రూప్ ఆఫ్ 20 దేశాల అధ్యక్ష పదవి కలిగి వుందని చెబుతూ సార్వత్రిక సోదర భావం అనే నినాదంతో మనం – అందరి శాంతి, శ్రేయస్సు కోసం నిలబడదామని ఆమె పిలుపిచ్చారు.
జి-20 అధ్యక్ష పదవి ప్రజాస్వామ్యాన్నీ, బహు పాక్షికతను ప్రోత్సహించడానికి ఒక అవకాశమని ఆమె పేర్కొన్నారు. అలాగే మెరుగైన ప్రపంచాన్నీ, మంచి భవిష్యత్తును రూపొందించడానికి సరైన వేదిక కూడా అని చెప్పారు. భారత్ నాయకత్వంలో జి-20 మరింత సమానమైన, స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు తన ప్రయత్నాలను మరింత మెరుగు పరచగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.