దేశవ్యాప్తంగా గురువారం 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కర్తవ్యపథ్‌పై రిపబ్లిడే పరేడ్ జరగడం ఇదే తొలిసారి. బ్రిటీష్ కాలం నుంచి రాజ్‌పథ్‌గా ఉన్న దీని పేరును గతేడాది కర్తవ్యపథ్గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. కర్తవ్యపథ్గా నామకరణం చేశాక ఇక్కడ జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఇవే. పరేడ్‌లో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు అబ్బురపరిచే విన్యాసాలు చేస్తాయి. కవాతులు నిర్వహిస్తాయి.
ఆర్మీ కవాతులో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కవాతు విజయ్‌చౌక్ వద్ద మొదలై ఎర్రకోట వరకు సాగుతుండగా.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు 65వేల మంది ప్రత్యక్షంగా హాజరయ్యారు. వుతున్నారు. వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 6000 మంది సైనికులు రిపబ్లిక్ డే సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. 150 సీసీ టీవీ కెమెరాతో నిఘా పెట్టారు.
17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి శకటాల ప్రదర్శన పరేడ్‌లో పాల్గొన్నాయి. వివిధ మంత్రిత్వశాఖలు, డిపార్ట్ మెంట్ల నుంచి మరో మరిన్ని ప్రదర్శనలో పాల్గొన్నాయి. సాంస్కృతిక వారసత్వం, ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, మహిళా శక్తి, నవభారతాన్ని కళ్లకు కట్టేలా ఈ శకటాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 479 కళాకారులు.. సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన, వివిధ రంగాల్లో రాణించిన 11 మంది చిన్నారులు.. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాన్ని అందుకున్నారు.