అమృత్ కాల్ లో ఇది తొలి బడ్జెట్ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ లా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు..లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను బుధవారం ఆమె ప్రవేశపెడుతూ రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని తెలిపారు. తొమ్మిదేండ్లలో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదిగామని పేర్కొన్నారు.
తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశామని, 7శాతం వృద్ధి రేటును ఆర్థిక సర్వే అంచనా వేసిందని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగామని పేర్కొంటూ కరోనా సమయంలోఎవరూ ఆకలితో బాధపడలేదన్న సీతారామన్ ఉచిత ఆహారధాన్యాల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. 2047 లక్ష్యంగా పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామని చెప్పారు.
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా వైద్యకళాశాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతామన్నారు. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఆదాయపన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంపు
బడ్జెట్ లో ఉద్యోగజీవులకు ఊరట కలిగించారు.. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి 7 లక్షలలకు పెంచారు. ఆదాయం 7 లక్షలు దాటితే అయిదు శ్లాబులలో పన్ను చెల్సించాల్సి ఉంటుంది. రూ.15 లక్షలు ఆదాయం ఉన్నట్లయితే ఏకంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కాగా,ఏడు లక్షలు దాటితే రూ.3 లక్షల నుంచే పన్ను చెల్లించాలి.. మూడు నుంచి 6 లక్షలవరకు అయిదు శాతం, అరు నుంచి 9 లక్షల వరకు 10 శాతం, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 20 శాతం, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సిందే.
సీనియర్ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంపు
ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్ చేసి, రూ.30లక్షలకు పెంపు
మహిళలు, బాలికల కోసం కొత్త స్కీమ్ సమ్మాన్ బచత్ పత్ర అనే కొత్త స్కీమ్.. 2025 వరకు అమల్లో ఉంటుంది.
ప్రధాన కేటాయింపులు
* అంత్యోదయ, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అమలు కోసం బడ్జెట్ లో రూ. 2 లక్షల కోట్ల కేటాయింపు. ఈ పథకం జనవరి 1, 2023 నుంచి సంవత్సరం పాటు కొనసాగుతుంది.
* ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రొగ్రామ్ ను ప్రభుత్వం త్వరలోప్రారంభించనుంది. ఇందులో విలువైన పళ్ల తోటల కోసం నాణ్యమైన, వ్యాధి నిరోధక ప్లాంటింగ్ మెటీరియల్ ను అందజేస్తారు. ఇందుకు రూ. 2200 కోట్లను కేటాయించారు.
* వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచారు. ఇందులో పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
* ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఒక సబ్ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు.
* దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించనున్న 157 నర్సింగ్ కళాశాలలు. వీటిని 2014 తరువాత ప్రారంభించిన 157 మెడికల్ కాలేజీల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేస్తారు.
*740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో రిక్రూట్ చేయనున్న టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ సంఖ్య 38,800 *రూ. 79000 : పీఎం : ఆవాస్ యోజన కోసం.
*రూ. 10 లక్షల కోట్లు : కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ఔట్ లే. ఇది జీడీపీలో సుమారు 3.3 %. అలాగే, 2019-20 ఔట్ లే కన్నా మూడు రెట్లు ఎక్కువ.
*రూ. 13.7 లక్షల కోట్లు :కేంద్ర కేపిటల్ ఎక్స్ పెండిచర్. ఇది జీడీపీలో సుమారు 4.5%.*రూ. 2.40 లక్షల కోట్లు : రైల్వే కు కేటాయించిన బడ్జెట్.
* దేశంలో ఈ ఆర్థిక సంవత్సరం నిర్మించనున్న ఏర్ పోర్ట్ లు, హెలీపోర్ట్ లు, వాటర్ ఏరోడ్రోమ్స్ సంఖ్య 50.
*రూ. 7 వేల కోట్లు : న్యాయ శాఖలో ఈ కోర్ట్స్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం.
ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. దీంతో ఏఏ వస్తువులు చౌకగా లభిస్తాయో, ఏఏ వస్తువులపై అధిక ధరల ప్రభావం పడిందనే విషయాన్ని పరిశీలించాలి.
ధరలు పెరిగేవి .. :బంగారం, ప్లాటినంతో తయారైన ఆభరణాలు, ఇమిటేషన్ జ్యూయలరీ ( గిల్టు నగలు), సిగరెట్లు, వెండి ఉత్పత్తులు, వంటగదిలో వినియోగించే ఎలక్ట్రిక్ చిమ్నీలు, దిగుమతైన సైకిళ్లు, ఆటవస్తువులు, విదేశాల నుండి దిగుమతయ్యే రబ్బరు, ఎలక్ట్రిక్ స్కూటర్లు,
ధరలు తగ్గేవి : హీట్ కాయిల్స్, మొబైల్ భాగాలు, ల్యాప్‌టాప్, డిఎస్ఎల్ఆర్ల కెమెరా లెన్సెలు, టివి ప్యానెల్ భాగాలు, లిథియం అయాన్ బ్యాటరీలు.