బంగ్లా యుద్ధం – 11
1971 యుద్ధంలో ఓటమి తర్వాత, భారత సైనికుల ముందు వారి సైనికులు భారీ సంఖ్యలో లొంగిపోయిన తర్వాత పాకిస్థాన్ అత్యంత ప్రమాదకరమైన గుణ పాఠాలు నేర్చుకుంది. అసంతృప్త మైనారిటీలను అణచివేయడం, దోపిడీ చేయడం దేశీయ రాజనీతికి ఆచరణీయ సాధనం అని నిర్ధారించుకొంది. మరెప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో భారత్ పై విజయం సాధించలేమని గ్రహించి, ప్రచ్ఛన్న యుద్ధం తన రాజకీయ వ్యూహంగా మార్చుకొంది.
ప్రచ్ఛన్న యుద్దాన్ని తన విదేశాంగ విధానానికి సమర్థవంతమైన సాధనంగా మలచుకొంది. మరోవంక, బంగ్లాదేశ్ సహితం ఆచరణీయ లౌకిక ప్రజాస్వామ్యంగా మారలేదు. అందుకు అవకాశాలు కూడా కనిపించడం లేదు. యుద్ధ భూమిలో భారతదేశంపాకిస్తాన్ను నిర్ణయాత్మకంగా ఓడించినప్పటికీ, రక్షణ సంస్కరణలు, ఆధునీకరణకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలతో అప్పటి నుండి కుస్తీ పడుతూనే ఉంది.
ఈ విజయాన్ని ఆసరాగా చేసుకొని కాశ్మీర్ సమస్యకు తుది వాక్యం పలికే ప్రయత్నం భారత్ చేయలేక పోయింది. డిసెంబరు 1971లో ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోయినప్పటికీ, అనేక ఇతర మార్గాల్లో, పాకిస్తాన్, దాని ప్రోత్సాహంతో విజృంభిస్తున్న ఇస్లామిస్ట్ హింస ప్రాజెక్ట్ ద్వారా భారత్ పై అతిపెద్ద, శాశ్వతమైన యుద్ధం ప్రకటించి నట్లయింది.
తూర్పు పాకిస్తాన్లో ఆధిపత్యం గల పాకిస్తాన్ జాతీయ మెజారిటీ బెంగాలీలు, పశ్చిమ పాకిస్తాన్‌లోని పాలక వర్గానికి మధ్య జరిగిన అంతర్గత ఆధిపత్య పోరు 1971 యుద్దానికి దారితీసింది. 1952లో బెంగాలీలు బెంగాలీని జాతీయ భాషగా గుర్తించాలని డిమాండ్ చేస్తుండడంతో ఈ వివాదం ప్రారంభమైనది. ఆ సంవత్సరం ఫిబ్రవరి 21-22 తేదీలలో, పాకిస్తాన్ సాయుధ బలగాలు విచక్షణారహిత కాల్పుల్లో అనేక మంది విద్యార్థులతో పాటు అనేక మంది ఇతరులను హత్యకు గురయ్యారు.
షైక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని తూర్పు పాకిస్తాన్‌కు చెందిన అవామీ లీగ్ జుల్ఫికర్ అలీ భుట్టో కు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని నిర్ణయాత్మకంగా ఓడించిన 1970 ఎన్నికల తరువాత జనరల్ యాహ్యా ఖాన్ పాలక జుంటా పార్లమెంటును సమావేశపరచడానికి నిరాకరించిన తర్వాత ఈ అంతర్గత వివాదం ఉధృతమైంది.
`కొత్త రాజ్యాంగం’ కోసం ముజిబుర్ వత్తిడి
ఎన్నికలలో విజేత పాక్ కు దాదాపు కొత్త రాజ్యాంగం కోసం వత్తిడి ప్రారంభించారు. ముజిబుర్ రెహ్మాన్ పార్టీ ఆరు అంశాల ఎజెండాతో విస్తృతమైన సమాఖ్య వ్యవస్థ కోసం చాలాకాలంగా పోరాడుతూ వచ్చింది. ప్రత్యేక కన్వర్టిబుల్ కరెన్సీలు; ఫెడరేటింగ్ యూనిట్లకు అప్పగించాల్సిన ఆర్థిక బాధ్యత; అలాగే ప్రత్యేక మిలీషియాను నిర్వహించే హక్కు. ఈ డిమాండ్లలో ప్రతి ఒక్కటి పశ్చిమ పాక్ సాంస్కృతిక, ఆర్థిక, భాషాపరమైన అణచివేతకు ప్రతిస్పందనగా వచ్చాయి.
అదే విధంగా మిలిటరీ, బ్యూరోక్రసీల నుండి తమను మినహాయించడం, బెంగాలీలకు రాజకీయ అధికారంలో చట్టబద్ధమైన వాటాను లేకుండా చేసేందుకు స్థిరంగా చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా చెలరేగాయి.
జనరల్ యాహ్యా, జుల్ఫికర్ అలీ భుట్టో నేతృత్వంలోని పశ్చిమ పాక్ లోని రాజకీయ ప్రముఖులు బలమైన సమాఖ్య ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అవామీ లీగ్ ఆరు అంశాల ఎజెండా దేశం నుండి పూర్తిగా విడిపోయేందుకు చేసిన ప్రతిపాదనలుగా భావించారు.
అవామీ లీగ్ అందించిన ఏ రాజ్యాంగాన్ని వీటో చేయలేని విధంగా చాలా తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, జుల్ఫికర్ అలీ భుట్టో తన పార్టీని పార్లమెంటు ప్రకియలో పాల్గొనేటట్లు చేయడానికి నిరాకరించాడు. అధికార-భాగస్వామ్య ఒప్పందం కోసం అసంబద్ధమైన డిమాండ్లు చేశాడు.
ముజిబుర్ రెహ్మాన్ వత్తిడులకు లొంగడానికి నిరాకరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవామీ లీగ్ కు గల హక్కుపై పట్టుబట్టిన తర్వాత, జనరల్ యాహ్యా ఖాన్ బెంగాలీలను నిరాయుధులను చేయడానికి క్రూరమైన, దుండగుడు సైనిక చర్య అయిన ఆపరేషన్ సెర్చ్‌లైట్‌ను ప్రారంభించాడు.
శరణార్థులు భారతదేశంలోకి పారిపోవడం ప్రారంభించడంతో, యుద్ధం రెండవ దశ ప్రారంభమైంది. రుతుపవనాలు సమీపిస్తున్నందున, బంగ్లాదేశ్‌లోని నదీతీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏ సైనిక చర్య అయినా రుతుపవనాలు ముగిసే వరకు వేచి ఉండాలని భారత్ గ్రహించింది.
చైనా తాను మద్దతు ఇస్తున్న పాక్ తరపున జోక్యం చేసుకోకుండా చేయడం కోసం పర్వత మార్గాల ద్వారా చైనీస్ కదలికలను మంచు నిరోధించే శీతాకాలం వరకు భారతదేశం వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ వాతావరణ, భౌగోళిక పరిమితులతో పాటు, 1971 వసంతకాలంలో సైనిక చర్యను చేపట్టడానికి భారతదేశం సిద్ధంగా లేదు. భారతదేశం వేసవిని పశ్చిమం నుండి తూర్పుకు బలగాలను మార్చడానికి, సైనిక కార్యకలాపాలకు మద్దతుగా అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగించుకుంది. తూర్పు పాకిస్తాన్లో స్పష్టంగా జరుగుతున్న జాతి ప్రక్షాళనను అంతం చేయమని పాకిస్తాన్‌కు సలహా ఇవ్వాలని రష్యా, అమెరికాలు భారత్ వేడుకొంటూ వచ్చింది.
మారణహోమం పట్ల చలించని నిక్సన్, కిస్సింజర్
అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, అతని జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ శరణార్థుల సంరక్షణ కోసం అపారమైన, పెరుగుతున్న వ్యయాన్ని కొంత మేరకు సబ్సిడీగా అందించడానికి గణనీయమైన సహాయాన్ని భారత్ కు అందించినప్పటికీ, భారతదేశ అభ్యర్థనల పట్ల చలించలేదు.
మొదట్లో, శరణార్థులు హిందువులు, ముస్లింలు అయినప్పటికీ, శరణార్థులలో ఎక్కువ మంది హిందూ బెంగాలీలు అని పశ్చిమ పాకిస్తానీ బలగాల హింసాత్మక చర్యల ద్వారా స్పష్టమైంది. స్వాతంత్య్ర సమయంలో, నలుగురిలో ఒకరు ముస్లిమేతర మైనారిటీలు, వీరిలో ఎక్కువ మంది తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ హిందువులు.
నిక్సన్ పరిపాలన తూర్పు పాకిస్థాన్ లో పాక్ సైన్యం జరుపుతున్న తీవ్రమైన దురాగతాల గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే అది చైనాతో అపూర్వమైన దౌత్యపరమైన సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం పాక్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్‌ను తన మధ్యవర్తిగా ఎంచుకుంది.
చైనాతో దౌత్యం కోసం ఐరోపాలో మరో ఇద్దరు మధ్యవర్తులు అందుబాటులో ఉన్నప్పటికీ నిక్సన్ యాహ్యాఖాన్ ను ఎంచుకున్నారు. నిక్సన్, కిస్సింజర్ లు యాహ్యాతో గాఢమైన వ్యక్తిగత ప్రేమను పెంచుకోవడమే అందుకు కారణం. పైగా, అతనిని అమెరికన్ సివిల్ వార్ జనరల్ యులిస్సెస్ గ్రాంట్‌తో నిక్సన్ పోల్చాడు.
ముఖ్యంగా వారిద్దరూ భారత ప్రధాని ఇందిరా గాంధీ పట్ల తీవ్ర స్త్రీద్వేషపూరిత ద్వేషం పెంచుకోవడమే అందుకు ప్రధాన కారణం.
నిక్సన్ చైనాతో వ్యక్తిగత సంబంధాన్ని సంపాదించుకున్న తర్వాత యాహ్యా మధ్యవర్తిత్వం అవసరం లేనప్పటికీ, ఢాకాలోని అమెరికా దౌత్యవేత్త ఆర్చర్ బ్లడ్, అమెరికా స్టేట్ డిపార్మెంట్ లోని ఇతర అసమ్మతి అధికారులు పాక్ సైన్యం తూర్పు పాక్ లో “జాతి నిర్ములన” కోసం మారణకాండకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నప్పటికీ, దానిని ఆపివేయమని కనీసం యాహ్యాను విజ్ఞప్తి చేయడానికి కూడా నిక్సన్ సుముఖత వ్యక్తం చేయలేదు.
చైనా జోక్యం కోరిన నిక్సన్
భారత్ జోక్యం చేసుకోకుండా నిరోధించడం కోసం చైనా జోక్యం చేసుకోవాలని కూడా నిక్సన్ కోరారు. దానితో తుది పోరుకు తప్పదని గ్రహించిన భారత్ ముందుగా ప్రచ్ఛన్న యుద్ధంను తీవ్రతరం చేస్తూ వచ్చింది. వేసవి అంతా బెంగాలీ ప్రతిఘటన దళాలకు శిక్షణ ఇచ్చింది. అదే సమయంలో అస్తవ్యస్తమైన, అసమర్థమైన బెంగాలీ రాజకీయ ప్రముఖులకు మార్గదర్శకత్వం వహించింది.
పాకిస్తాన్ కు చెందిన బలీయమైన సాయుధ బలగాలను సవాలు చేయడానికి భారతదేశం ఈ ప్రభుత్వేతర వర్గాలకు మద్దతు ఇవ్వడంతో, పాకిస్తాన్ కూడా జమాత్-ఇ-ఇస్లామీ అపఖ్యాతి పాలైన హింసాత్మక విద్యార్థి విభాగంతో సహా అనేక ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థల ద్వారా పని చేసింది.
వేసవి ముగిసే సమయానికి, పాకిస్తాన్,ప్రభుత్వేతర పోరాట యోధులతో పోరాడిన బెంగాలీ తిరుగుబాటుదారులకు భారతదేశం ఫిరంగి మద్దతును అందిస్తోంది. తూర్పు పాకిస్తాన్ హత్యా క్షేత్రంగా మారింది.
అయితే ఈ సందర్భంగా జరిగిన మారణహోమం వివరాలు, జరిగిన హత్యాకాండ గురించిన నిజమైన వివరాలు ఇప్పటికి సాధికారికంగా అందుబాటులో లేవు. జరిగిన మారణహోమాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం పాక్ చేస్తుండగా, దానిని మరింత ఎక్కువగా చూపే ప్రయత్నం బాంగ్లాదేశ్ చేస్తున్నది. అయితే భారత్ అందుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా బహిరంగ పరచలేదు.
ఈ యుద్ధం ఫలితంగా పాక్ తన జనాభాలో సగానికి పైగా, దాదాపు 15 శాతం భూభాగాన్ని కోల్పోయింది. ఏదేమైనా, తూర్పున కోల్పోయిన 54,500 చదరపు మైళ్ల (1,41,154 చదరపు కి.మీ) భూమిలో 61 శాతం వ్యవసాయయోగ్యమైనది 310,000 చదరపు మైళ్ల (8,02,896 చదరపు కి.మీ)లో 21 శాతం మాత్రమే ఉంది.
జుల్ఫికర్ అలీ భుట్టో జులై 1977లో తిరుగుబాటులో జనరల్ జియా-ఉల్-హక్ అతనిని తొలగించే వరకు పశ్చిమాన్ని నిర్దాక్షిణ్యంగా పరిపాలించడానికి అనుమతించి తూర్పును కోల్పోవడానికి కారణమైనది పాక్ సైన్యం పట్ల ఆ దేశ ప్రజలలో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అయ్యాయి.