బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ అలహాబాద్ నుండి రానున్న లోక్ సభ ఎన్నికల్లో అలహాబాద్ నుండి రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది.
ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ త్వరలో ముంబయి వెళ్లి అమితాబ్ బచ్చన్, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభిషేక్ ఎన్నికల బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారనున్నది. అమితాబ్‌కు ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నది.
అమితాబ్ బచ్చన్ 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుండి ఘన విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రముఖ నేత హేమవతి నందన్ బహుగుణను ఓడించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు 68శాతం ఓట్లు రాగా, బహుగుణకు 25 శాతం ఓట్లే పోలయ్యాయి.
అభిషేక్ అభ్యర్థిత్వంపై మయునాపర్ అధ్యక్షుడు పప్పులాల్ నిషాద్ స్పందిస్తూ ఇది కేవలం చర్చ మాత్రమేనని.. ఏదైనా ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రీటా బహుగుణ జోషికి టికెట్ ఇస్తే 1984 నాటి సీన్ ప్రయాగ్‌రాజ్‌లో నాటి సీన్ మరోసారి కనిపించనున్నది.
వాస్తవానికి డాక్టర్ రీటా బహుగుణ జోషి త్రండి హేమవతి నందన్ బహుగుణ లోక్‌దళ్ నుంచి, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ సారి రీటా, అభిషేక్ బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారనుంది.