ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ సినిమాకు చేసిన విశిష్ఠ సేవలకు గాను వహిదా రెహమాన్‌ను ఈ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు.
వహీదా రెహమాన్ 1955లో వచ్చిన రోజులు మారాయి అనే తెలుగు సినిమాతో తన నటన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత బాలీవుడ్ కు మారి నటిగా రాణించి అక్కడే స్థిరపడ్డారు. రేష్మ ఔర్ షేరా సినిమాలో పాత్రకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ సైతం ఆమెను వరించాయి. కృషితో తన కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న భారతీయ వనితకు వహీదా నిదర్శనమని కేంద్ర మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు.
చారిత్రక మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తరుణంలోనే ఫాల్కే అవార్డుకు వహిదా రెహమాన్ ఎంపిక కావడం గర్వకారణమని ఒక ట్వీట్లో అభినందనలు తెలిపారు. ”వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది” అని కేంద్ర మంత్రి తెలిపారు.
ప్యాసా, కాగజ్ కాఫూల్, చౌద్వి కా చాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్, గైడ్, ఖామోసి వంటి పలు హిందీ చిత్రాలు చేశారు. ఐదు దశాబ్దాల నట చరిత్రలో ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. ఆమె నటించిన రేష్మా అండ్ షెర చిత్రానికి జాతీయ ఉత్తత చిత్రం అవార్డు వచ్చింది. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి.
కఠోర పరిశ్రమ, వృత్తి నిబద్ధతతో భారతీయ మహిళా శక్తిని వహిదా చాటుకున్నారు. ‘నారీ శక్తి వందన్’ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరుణంలోనే ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం రావడం అందరూ గర్వంచదగిన విషయం. సినిమాలు, ఫోటోగ్రఫీ, సమాజ సేవ వంటి రంగాల్లోనూ వహిదా తమ ప్రతిభను, సేవాభావాన్ని చాటుకున్నారు.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పేరుప్రతిష్టలు తెచ్చిన వారిలో ఒకరుగా వహిదా రెహమాన్ పేరొందారు. వహిదా రెహమాన్‌కు ఈ ఏడాది చివర్లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఆమెకు ముందు భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి ఆశా ఫరేఖ్ ఈ అవార్డును అందుకున్నారు.