బుల్లిబాయి ఉదంతంపై కొన్ని సంస్థలు, మీడియా మతోన్మాదం కోణాన్ని ఆపాదించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేకమంది ప్రముఖ మహిళలపై ఆన్లైన్ దుర్వినియోగపరచి అవమానకరమైన విధంగా వ్యవహరించిన చర్యలపై జరుగుతున్న దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసేవరకు వేచి ఉండాలనిపేట్రియాటిక్ పీపుల్స్ ఫ్రంట్ అస్సాం (పిపిఎఫ్ఎ) హితవు చెప్పింది.
ఈ యాప్ లో వందమందికి పైగా కొందరు జర్నలిస్ట్ లతో సహా ప్రముఖ మహిళలు, వారిలో అత్యధికంగా ముస్లిం మహిళల ఫోటోలను మార్చి పని మనుషులుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నారని అంటూ గత వారం ఆన్లైన్ లో ప్రకటనలు రావడం కలకలం రేపడం తెలిసిందే. అయితే ఆలస్యంగా యాప్ ను సంబంధిత వ్యక్తులే మూసివేశారు.
ఈ విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు మహిళా కార్యకర్తలు వివిధ సెక్షన్ల కింద న్యూఢిల్లీ, ముంబైలలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. లింగ పక్షపాతం, లైంగిక వేధింపులు, మతపరమైన శత్రుత్వంతో వ్యవహరించే నిబంధనలను ప్రస్తావించారు. ఈ నేరంతో సంబంధం ఉన్నదనే అనుమానంతో ఇప్పటి వరకు అస్సాంలోని జోర్హాట్ కు చెందిన ఒక వ్యక్తితో పాటు వివిధ ప్రాంతాలలో నలుగురిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారంతా ఒక యువతితో సహా విద్యార్థులు. ఈ నేరంలో మతపరమైన అజెండాతో, హిందూ జాతీయ వాదుల ప్రమేయంతో వారికి సంబంధం ఉన్నట్లు విచారణలో ఇప్పటి వరకు ఎలాంటి వాస్తవం బయటపడలేదు. దీనిపై న్యాయమైన విచారణ జరపాలని పీపీఎఫ్ఏ డిమాండ్ చేస్తోంది. ఈ సంబంధంగా మతపరమైన చర్చలతో వాతావరణాన్ని కలుషితం చేయవద్దని సంబంధిత వ్యక్తులు, వర్గాలను కోరుతుంది.
ఇటీవల అరెస్ట్ చేసిన గిట్ హబ్ సైట్ పై బుల్లిబాయి యాప్ ను అభివృద్ధి చేయడంలో ప్రధాన సూత్రధారిగా జోర్హాట్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి నీరజ్ బిష్ణోయ్ అని అనుమానిస్తున్నారు. వాస్తవానికి అతను రాజస్థాన్ కు చెందిన వ్యక్తి. ప్రాధమిక దర్యాప్తు నివేదికల ప్రకారం అతను వక్రీకరించి లాంగిక ధోరణులు కలిగి ఉన్నాడని, అతనికి ఏ హిందూ జాతీయవాద సంస్థతో సంబంధం లేదని తెలుస్తున్నది.
”నేరస్థులను చట్టప్రకారం శిక్షించాలి. కానీ అంతర్జాతీయ మీడియా మార్కెట్ కోసం ఎక్కువగా ముస్లిం మహిళలను లక్ష్యంగా ఈ యాప్ చేసుకోవడంతో హిందూత్వ కోణాన్ని జోడించడంలో అర్ధం లేదు” అని పిపిఎఫ్ ఎ స్పష్టం చేసింది. చైతన్యవంతమైన భారత పౌరులు దీనిని అవకాశంగా తీసుకొని ప్రయోజనం పొందాలని కుట్రలు పన్నే దేశ అవ్యతిరేకులపై నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేసింది.