తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు.
తెలంగాణ మంత్రులు.. వారి శాఖలు ఇవే:
.మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
.ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోం
.శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖ
.తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ
.జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ
.దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
.పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ
.సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ
.కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
.కోమటిరెడ్డి వెంకటరెడ్డి – పురపాలక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటిపారుదల శాఖ.
సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్గా సీనియర్ ఐపిఎస్ అధికారి శివధర్ రెడ్డిని నియమించారు. ఇద్దరిని నియమిస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.