ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం గురించి చేసిన ట్వీట్‌కి నటుడు సిద్ధార్థ్ చేసిన రీ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నెహ్వాల్‌పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదనిఎం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
ఇటీవల పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని కాన్వాయ్ దాదాపు అరగంట పాటు బటిండాలోని ఫ్లైవోర్పై నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశమంతా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా దీనిపై సైనా నెహ్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘ప్రధానికే అలాంటి పరిస్థితి ఎదురైతే.. ఏ దేశమైనా సురక్షితంగా ఉందని ఎలా అనుకోగలం? ప్రధానిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. నెహ్వాల్ చేసిన ట్వీట్‌కు సిద్ధార్థ్ రీ ట్వీట్ చేస్తూ.. ‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్.. భగవంతుడి దయవల్ల భారతదేశాన్ని కాపాడేవారు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
సిద్ధార్థ్ ట్వీట్ ను జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచేవిధంగా మాట్లాడిన సిద్ధార్థ్ ట్విటర్ ఖాతాను వెంటనే తొలగించాలని, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని మహారాష్ట్ర డిజిపిని రేఖాశర్మ కోరారు.
ఇదిలా ఉంటే ‘నేను కొన్ని విషయాల్లో కాక్ అండ్ బుల్’ అని ప్రస్తావిస్తుంటాను. నేనెవరినీ కించపరిచేవిధంగా మాట్లాడలేదని వివరణ ఇస్తూ తాజాగా సిద్ధార్థ్ మరో ట్వీట్ చేశారు.
మరోవైపు సిద్ధార్థ్ ట్వీట్‌పై నెహ్వాల్ స్పందిస్తూ.. ‘ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. ఒక నటుడిగా నేను ఆయన్ని ఇష్టపడతా. సిద్ధార్థ్ ఇలా వ్యాఖ్యానించడం సరైంది కాదు. ఆయన తన అభిప్రాయాన్ని ఇంతకంటే మంచి పదాలతో వ్యక్తపరవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారనుకుంటా. ప్రధాని భద్రత అనేది దేశ సమస్య అయితే, దేశంలో ఏది భద్రమైనదో నాకు కచ్చితంగా తెలియదు’ అని సైనా కౌంటర్ ఇచ్చారు.
కాగా, సిద్ధార్థ్ వ్యాఖ్యలపై బిజెపి నాయకురాలు ఖుష్ఫూకూడా తీవ్రంగా స్పందించారు. ‘నా స్నేహితుడైన సిద్ధార్థ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు నేను ఊహించలేదు. ఈ వ్యాఖ్యలు సిద్ధూ తల్లిదండ్రులు కూడా అగౌరవంగానే భావిస్తారని నేను అనుకుంటున్నాను’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు.