బ్రిటిష్ వలస పాలకుల నుండి, పాకిస్థాన్ నుండి ఎన్ని ప్రలోభాలకు, వత్తిడులు ఎదురైనా లెక్క చేయకుండా జమ్మూ, కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసిన చివరి రాజవంశీయుడైన రాజా హరిసింగ్ రాజకీయ వారసత్వం గురించి 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కాశ్మీర్ లోయలో ప్రస్తావన వస్తున్నది.
మహారాజా హరిసింగ్ పుట్టినరోజును నిర్వహించాలా వద్దా అని నిర్ణయించడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ఇలా ఉంది: “మహారాజా హరి సింగ్ జీ జన్మదిన జ్ఞాపకార్థం జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సాధారణంగా లేదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం దీనిని పాటించడం గురించి కమిటీ ని ఇందుమూలంగా నియమించడం జరిగింది.”
జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రానికి చెందిన చివరి పాలక మహారాజు “నియంత” అని పిలిచినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ గత ఏడాది డిసెంబర్లో వ్యాఖ్యానించిన తర్వాత ప్రభుత్వం తాజా చర్య తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ పాలిస్తున్న బిజెపి నేత అయిన లెఫ్టనెంట్ గోవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఈ వాఖ్య చేయడం వేరే విషయం. .
ఆజాద్ నుండి ప్రకటన వెలువడినప్పటి నుండి, జమ్మూలోని బిజెపి బిజెపి అధ్యక్షుడితో సహా అనేకమంది మహారాజా హరి సింగ్ భారీ చిత్రాలను తమ కార్యాలయ గదులలో ఉంచడం ప్రారంభించారు. చాలా మంది బిజెపి నాయకులు తమ ఇంటర్వ్యూలలో తాము మాట్లాడుతున్నప్పుడు హరి సింగ్ పోర్ట్రెయిట్ వైపు చాలాసార్లు కెమెరా దృష్టి ఆకట్టుకొనే విధంగా చూస్తున్నారు.
మహారాజా హరిసింగ్ గురించి ఆజాద్ ఏమన్నారు? “నేను ఎప్పుడూ దర్బార్ తరలింపుకు అనుకూలంగా ఉంటాను. మహారాజీ (హరి సింగ్) ప్రజల ప్రయోజనాల కోసం మూడు పనులు చేశారు. ఒకటి జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం దర్బార్ ఉద్యమం. రెండవది ఎవరూ (బయటి వ్యక్తి) మా భూమిని కొనుగోలు చేయలేరు. మా భూమి కూడా మా ఆసక్తికి సంబంధించినది. మూడవది, బయటి నుండి ఎవరూ ఉద్యోగం పొందలేరు” అని ఆజాద్ చెప్పారు.
“చాలా ఏళ్ల తర్వాత నియంతగా, ఏకవ్యక్తిగా, నిరంకుశుడిగా మనం అభివర్ణించిన మహారాజు ఈనాటి కంటే ప్రజల సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచించారు. ఈ మూడింటినీ నేటి ప్రభుత్వం తీసివేసింది” అని ఆజాద్ విమర్శించారు.
ఆజాద్ వాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ “చరిత్ర పేజీలను తిరగేసి, మహారాజా హరి సింగ్ను అతని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించాడో చూడండి” అంటూ బిజెపి నేతలు చురకలు అంటించడం ప్రర్మభించారు.
మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హరి సింగ్ను బహిష్కరించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంలకు సంబంధించి అన్ని గందరగోళాలకు నెహ్రూ కారణమని, ఇది పూర్వపు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రపు దశాబ్దాల శాంతియుత నిర్మాణాన్ని ధ్వంసం చేసిందని బిజెపి తన సీనియర్ నాయకుడు కవీందర్ గుప్తాతో విమర్శించారు.
“నెహ్రు షైక్ మొహమ్మద్ అబ్దుల్లాతో కుమ్మక్కై అనుసరించిన తప్పుడు విధానాలు, స్వార్థ ప్రయోజనాల కారణంగా ఈ ప్రాంతం అనిశ్చితిలో కూరుకుపోయింది, దీని కారణంగా సామాన్య ప్రజలు అత్యంత బాధలను అనుభవించారు”. అంటూ విమర్శలు కొనసాగాయి.
గత మూడు నెలలుగా, బిజెపికి కంచుకోటగా ఉన్న జమ్మూ ప్రాంతంలో ఆజాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర హోదా పునరుద్దరించాలని కోరుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత బైటి వ్యక్తులు వచ్చి భూములు కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చని అంటూ స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం కోడం ఆజాద్ రాజా హరిసింగ్ వారసత్వాన్ని తెరపైకి తెస్తున్నారు.
మహారాజాకు అనుకూలంగా ఆజాద్ వాదించినప్పటి నుండి, బిజెపితో పాటు స్థానికంగా పలు వర్గాలు మహారాజా పుట్టినరోజున సెలవు కోరడం ప్రారంభించారు.