అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తుండడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుస్థానం నిష్ఠగా కఠిన దీక్ష పాటిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.
రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన దీక్ష పాటిస్తున్నారు. సూర్యోదయానికి ముందుగానే నిద్రలేస్తున్నారు. లేచిన వెంటనే కాలకృత్యాల్ని తీర్చుకొని ధ్యానం చేస్తున్నారు. ఆ తర్వాత యోగాసనాలు వేస్తున్నారు.
స్నానం చేసి కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతున్నారు. కఠినమైన తపస్సు చేస్తున్నారు.. కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ నిరంతరాయంగా పర్యటనలు చేస్తున్నారు. నేల మీద కేవలం దుప్పటి వేసుకుని నిద్రిస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభం పురస్కరించుకొని దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ స్వచ్ఛ ఆలయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవం వేళ నిత్యం రాముడి కీర్తనలు వింటూ దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.
ఈ క్రమంలో రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్లేలిస్ట్‌తో పాటు.. రామాయణ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్పూర్తిని ఇచ్చిందంటూ భజన కీర్తనలకు సంబధించిన వీడియో లింక్స్‌ను కూడా నెట్టింట పోస్టు చేశారు.
అయోధ్యలో ఈనెల 22న రామాలయం ప్రారంభోత్సవ వేడుకల రోజున ప్రజలందరూ తమ ఇండ్లలో జ్యోతిని వెలిగించాలని, రామ జ్యోతితో తమ జీవితాల్లో పేదరికం తొలగిపోయేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ప్రజల జీవితాలలో నుంచి పేదరికం నిర్మూలనకు అది స్ఫూర్తిదాయకం కాగలదని ప్రధాని తెలిపారు.
ప్రధాని శుక్రవారం షోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నిజాయతీతో పాలన సాగించాలనే శ్రీరాముని సిద్ధాంతాలే తన ప్రభుత్వానికి ప్రేరణ అని స్పష్టం చేశారు. ‘శ్రీరాముడు తన ప్రజలకు ఆనందం చేకూర్చే పని చేశారు. నిరుపేదల సంక్షేమానికి, సాధికారతకు నా ప్రభుత్వం అంకితం అయింది. వారి ఇక్కట్లు తీర్చడానికి మేము పథకాలు ప్రారంభించాం’ అని ప్రధాని తెలిపారు. అయోధ్యలో నూతన రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టతో దశాబ్ధాల పాటు అనుభవించిన వేదన సమసిపోయిందని పేర్కొన్నారు.