లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయిన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యయనంలో వెల్లడైంది. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదు కాగా, వీరిలో ఐదుగురు బీజేపీకి చెందినవారే.
28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారే కావడం గమన్హారం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది.
ఈ రాష్ట్రాల్లో ఉన్న ఎంపీల్లో సగం మంది కంటే ఎక్కువ మందిపై కేసులు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీల విద్యార్హతలను కూడా ఏడీఆర్ నివేదికలో పొందుపర్చింది. ఇందులో 73 శాతం మంది ఎంపీలు డిగ్రీలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.
మరోవైపు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. అత్యంత ధనిక ఎంపీల్లో రాజస్థాన్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్‌నాథ్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సురేశ్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో వైసీపీకి ఇటీవలె రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనుమూరు రఘురామ కృష్ణరాజు ఉన్నారు.
లోక్‌సభ ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ. 100 కోట్లకు పైమాటే. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నకుల్ నాథ్ తొలిస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్(కాంగ్రెస్), రఘురామకృష్ణ రాజు ఉన్నారు. 73 శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.