రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. కళాకారుడు ప్రభా ఆత్రే, ప్రముఖ సాహిత్యకారుడు రాధేశ్యామ్ కేంహలకు కూడా పద్మ విభూషణ్ లను ప్రకటించారు.
కాగా, కాంగ్రెస్ నేత, మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, సిపిఎం నేత మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య లకు పద్మ భూషణ్‌ను ప్రకటించింది. టెక్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లకు కూడా పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది.
128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి.
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్, కళా రంగానికి సంబంధించి తెలంగాణకు చెందిన దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజా రెడ్డిలను పద్మశ్రీకి ఎంపికయ్యారు. సాహిత్యం, విద్య రంగానికి సంబంధించి ఏపీ నుంచి గరికపాటి నర్సింహారావు, గోసవీడు షైక్ హుస్సేన్, మెడిసిన్ రంగంలో డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావులను పద్మశ్రీ వరించింది.
మైక్రోసాఫ్ట్ అధిపతి సత్య నాదేళ్లపాటు మరో ఐటీ దిగ్గజమైన గూగుల్ సారథి సుందర్ పిచైకి కూడా ‘పద్మభూషణ్’ లభించింది. అమెరికాలో స్థిరపడిన భారతీయ పాక శాస్త్ర నిపుణుడు మాథుర్ జఫెరీని కూడా ‘పద్మ భూషణ్’ వరించింది.
మెక్సికోకు చెందిన ప్రవాస భారతీయుడు సంజయ్ రాజారాం (సైన్స్, ఇంజనీరింగ్)కు మరణానంతరం ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఇంకా.. విదేశీ ప్రముఖులు మేరియా క్రిస్టఫర్ బైర్స్కి (పోలాండ్), ర్యైకో హిరా (జపాన్), రుట్జర్ కోర్టెన్‌హార్స్ట్ (ఐర్లాండ్)లను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసింది. మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేస్తారు.