భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య వాణిజ్యం, ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన, ధార్మిక క్షేత్రాల సందర్శనకు హిందూ, ముస్లిం, సిక్కు యాత్రికులు విమానంలో ప్రయాణించడానికి భారత్ అనుమతించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కోరింది.
అందుకోసం లాహోర్ నుంచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఎ) కు చెందిన రెండు చార్టర్డ్ విమానాలను అనుమతించాలని కోరుతూ పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ (పిహెచ్సి) చీఫ్ ప్యాట్రన్ రమేష్ వాంక్వానీ వ్రాసిన లేఖను ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)కు అందజేసింది.
ఈ విషయమై భారత ప్రభుత్వం స్పందించవలసి ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సీనియర్ అధికారి ఒకరు “ప్రస్తుతం విమానయాన సంస్థ నుండి ఎటువంటి అభ్యర్థన రాలేదు” అని చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన శ్రీనగర్-షార్జా విమానాలకు పాకిస్తాన్ ఓవర్‌ఫ్లైట్ అనుమతిని నిరాకరించిందని, డిసెంబర్లో భారతీయ యాత్రికులను పాకిస్తాన్‌కు తీసుకెళ్లడానికి పిఐఎ విమానాలను అనుమతించడానికి భారతదేశం నిరాకరించిందని అధికారులు గుర్తు చేశారు.
అనుమతులు లభిస్తే, 2019లో కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత భారతదేశానికి ప్రయాణించే మొదటి పిఐఎ విమానం ఇది మరియు 1947 తర్వాత ఇరువైపుల నుండి యాత్రికులను తీసుకువెళుతున్న మొట్టమొదటి విమానం అవుతుంది. 1947 తర్వాత ఆ విధంగా యాత్రికుల కోసం రెండు దేశాల మధ్య నడిచే మొదటి విమానం అవుతుంది. ప్రస్తుతం, రెండు దేశాల యాత్రికుల సమూహాలు రోడ్ మార్గంలో వాఘా/అటారీ సరిహద్దు మీదుగా ప్రయాణిస్తున్నారు.
పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ గత డిసెంబర్ లో పిఐఎ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 170 మంది యాత్రికులలో, ఎక్కువగా ముస్లింలు, దాదాపు 20 మంది హిందూ యాత్రికులతో కలసి ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది.
మారుమూల గల ఖైబర్‌లోని “శ్రీ పరమహంస్ మహారాజ్ మందిర్” ను సందర్శించడానికి గత కొన్ని వారాలలో బ్రిటన్, యుఎఇ, స్పెయిన్ తదితర దేశాల నుండి హిందూ యాత్రికులను పెషావర్ వరకు రెండు ఛార్టర్డ్ విమానాలలో హిందూ కౌన్సిల్ పంపే ఏర్పాటు చేసింది. భారతీయ యాత్రికులు కాలినడకన వాఘా మీదుగా లాహోర్ నుండి పెషావర్ చేరుకున్నారు.
“అజ్మీర్ షరీఫ్, నిజాముద్దీన్ ఔలియా దర్గా, ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే పాకిస్థానీల కోసం మేము ఈ పరస్పర సందర్శనను విమానంలో నిర్వహించాలని నేను చాలా ఆశాభావంతో ఉన్నాను. అలాంటి మొదటి విమానంలో నేను స్వయంగా ప్రయాణించాలని అనుకొంటున్నాను” అని వాంక్వానీ తెలిపారు.
రూపొందించిన కార్యక్రమం ప్రకారం, యాత్రికులు జైపూర్, అజ్మీర్, ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ సందర్శనలతో సహా జనవరి 29-ఫిబ్రవరి 1 నుండి భారతదేశానికి నాలుగు రోజుల పర్యటన చేస్తారు. అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ శాసనసభ్యుడు కూడా అయిన వాంక్వానీ, తాను పాకిస్తాన్ అధికారులతో చర్చించానని, భారతదేశం నుండి ఎయిరిండియా విమానాలను పాకిస్తాన్‌కి వెళ్లడానికి అనుమతించే అవకాశం ఉందని చెప్పారు.
ఇరువైపులా అనుమతిస్తే, ఈ విమానాలు భారతీయ హిందూ యాత్రికులను పెషావర్‌కు పరమహంస మందిరానికి, కరాచీకి హింగ్లాజ్ మాతా మందిర్‌కు తీసుకువెళతాయి. ఇదివరలో, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చివరిసారిగా మార్చి 2008లో పాకిస్తాన్‌కు వెళ్లింది. రెండు పొరుగు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ఛేదించడానికి ఎవ్వరో ఒకరు ముందుకు రావాలి గదా అని పేర్కొన్నారు.
భారత్ చేపట్టిన ఆర్టికల్ 370 సవరణ, జమ్మూ, కాశ్మీర్లో ఇతర చర్యలను నిరసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం అనేక ప్రతీకార చర్యలను చేపట్టిన తర్వాత, ఆగష్టు 2019 నుండి రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. వాఘా సరిహద్దు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా 500,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలని భారతదేశం చేసిన అభ్యర్థన కూడా చాలా నెలలుగా పాకిస్తాన్ అనుమతి విషయం పెండింగ్ లో ఉంది.
ఇప్పుడు సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించడంతోపాటు మతపరమైన తీర్థయాత్రల మార్పిడి కూడా కొన్ని భారతదేశం-పాకిస్తాన్ విశ్వాసాన్ని పెంపొందించే చర్యలలో భాగం అయ్యే అవకాశం ఉన్నాయి.
ప్రతి సంవత్సరం రెండు వైపులా వందలాది వీసాలు జారీ చేస్తారు. హిందూ, సిక్కు, ముస్లిం యాత్రికులు; ఒకరికొకరు ఇరుపక్షాల ఖైదీల జాబితాలను, అణు వ్యవస్థాపనల జాబితాలను మార్పిడి చేసుకునే ఒప్పందాన్ని కలిగి ఉంటాయి. వాటిని ఇప్పటికీ అమలు చేస్తున్నారు.
అయితే, రెండు దేశాలకు ప్రత్యక్ష ప్రయాణ లేదా వాణిజ్య సంబంధాలు లేవు. ఢిల్లీ, ఇస్లామాబాద్లలోతమ తమ మిషన్ల గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం రెండు దేశాలకు హైకమిషనర్లు లేరు.