సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా జస్టిస్ హెచ్ఎన్ కోటిశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు ఈ విషయం తెలిపారు. జస్టిస్ సింగ్ ప్రస్తుతం జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లడక్ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తుండగా, మద్రాసు హైకోర్టు జడ్జిగా ఆర్.మాధవన్ ఉన్నారు.
జస్టిస్ కోటిశ్వర్ సింగ్ గత ఫిబ్రవరిలో 12 జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లఢక్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరి 15న ప్రమాణస్వీకారం చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జూన్ 12న కోటిశ్వర్ సింగ్ పేరును ఏకగ్రీంగా సిఫారసు చేసింది. కొలిజియంలో ఇతర సభ్యులుగా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్య కాంత్, హృషికేష్ రాయ్ ఉన్నారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో 1963 మార్చి 1న జన్మించిన కోటిశ్వర్ సింగ్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు కావడానికి ముందు 2008లో గౌహతి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. 2011లో గౌహతి హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 2012 పెర్మనెంట్ జడ్జి స్థాయికి చేరుకున్నారు. 2013లో మణిపూర్ హైకోర్టు జడ్జిగా నియమితులై 2018లో గౌహతి హైకోర్టుకు బదిలీ అయ్యారు.
కాగా, వెనుకబడి తరగతుల వర్గానికిచందిన జస్టిస్ ఆర్.మహదేవన్ మద్రాసు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టాపొందిన ఆయన 1989లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 25 ఏళ్లగా ఆయన సివిల్, క్రిమినల్ , రిట్ కేసుల్లో స్పెషలైజ్డ్గా పేరుతెచ్చుకున్నారు. 2013లో మద్రాసు హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.