లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్‌తో పాటు దేశానికి ఓ న్యూస్పోర్ట్కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జర్నలిస్ట్ సలా ఉద్దీన్ షోయబ్ చౌదరి, అతిధిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనియా గాంధీని విదేశీ గూఢచారి అంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ షోయబ్ చౌదరి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారని.. అలాగే రెండుమతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో జర్నలిస్ట్ ఈ పోస్ట్‌ని షేర్ చేసినట్లు తెలిపారు.
రాహుల్ గాంధీపై సైతం ఆరోపణలు చేసినట్లు శ్రీనివాస్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. 196, 353 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కేసును విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.