గల్వాన్ లోయలో రెండేండ్ల కిందట భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా వైపు 42 మంది సైనికులు చనిపోయారని ‘ద క్లాక్సన్’ అనే ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. తమ వైపు నలుగురే చనిపోయారని చైనా చేసిన ప్రకటన అబద్ధమని తేల్చిచెప్పింది. సోషల్ మీడియా దర్యాప్తు ఆధారంగా ఆ పత్రిక ‘గల్వాన్ డీకోడెడ్’ పేరిట కథనాన్ని వెలువరించింది. కొందరు వీబో యూజర్లు పెట్టిన పోస్టులను, వీడియోలను ఇందులో ప్రస్తావించింది.
‘‘గల్వాన్ లోయలో 2015, జూన్ 6న చైనా, ఇండియా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మాట్లాడేందుకు భారత సైన్యం నుండి నుంచి కర్నల్ సంతోష్ బాబు బృందం గల్వాన్ లోయకు చేరుకుంది. చైనా ఆర్మీ కర్నల్ ఖీ ఫబావో మాత్రం 150 మంది సైనికులతో వచ్చారు.
చర్చలకు బదులుగా దాడికి ఆదేశించారు. దీంతో రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఆ తర్వాత ఖంగారుతో భయపడి చైనా సైనికులు వెనక్కి పారిపోయారు. ఈ క్రమంలో ఆయుధాలు ధరించిన 38 మంది నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు దర్యాప్తులో తేలింది” అని ఆస్ట్రేలియన్ పత్రిక వివరించింది.
“సైనికుల మృతదేహాలను ముందుగా షిఖ్వానే మార్టైర్ సిమెటరీకి తీసుకెళ్లి, ఆ తర్వాత వాళ్ల సొంతూళ్లకు పంపించారు’’ అని పేర్కొంది. భారత్ తో జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కి బఫర్ జోన్లో చైనా సైన్యం నిర్మాణాలు చేపట్టిందని ఆ పత్రిక వెల్లడించింది. 2020 ఏప్రిల్ నుంచే ఆ ప్రాంతంలో సైనిక నిఘానూ పెంచిందని చెప్పింది.
బఫర్ జోన్లో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగిస్తామని చెప్పిన చైనా సైన్యం.. మాట తప్పిందని, పైగా నదిపై ఇండియా కట్టించిన బ్రిడ్జిని కూల్చి వేసిందని పేర్కొంది.
అమెరికా ఆగ్రహం
మరోవంక, గల్వాన్ ఘర్షణలో మారణహోమానికి పాల్పడిన కర్నల్ ఖీ ఫబావోను బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా చైనా నియమించడంపై అమెరికా మండిపడింది. ఒలింపిక్స్ రిలేలో నాలుగు సార్లు షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్వాంగ్ మెంగ్ నుంచి ఫబావో టార్చ్ (ఒలింపిక్ జ్యోతి)ని అందుకున్నాడు. ఈ చర్యతో ఒలింపిక్స్‌కు డ్రాగన్ కంట్రీ రాజకీయ రంగు పులిమిందని అమెరికా ఆరోపించింది.
‘‘2020లో భారత సైనికులపై దాడికి పాల్పడిన సైనికుడిని, వీగర్ ముస్లింలను ఊచకోత కోసిన వ్యక్తిని వింటర్ ఒలింపిక్స్‌కు చైనా టార్చ్‌బేరర్‌గా నియమించడం ఓ సిగ్గుమాలిన చర్య. వీగర్ల స్వేచ్ఛ, భారత్ సార్వభౌమత్వానికి సావర్నిటీకిఅమెరికా ఎప్పుడూ మద్దతిస్తుంది’’ అని అమెరికా సెనేట్ ఫారిన్రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ జిమ్ రిష్ ట్వీట్ చేశారు.
కాగా, పొరుగు దేశాలతో మున్ముందు ఎదుర్కోబోయే ప్రమాదాలకు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు కేవలం ట్రైలర్లేనని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే స్పష్టం చేశారు. ఆ దేశాల చర్యలతో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. చైనా, పాక్‌ల పేర్లు ఎత్తకుండానే ఆ దేశాల వల్ల ఎదురవ్వబోయే ముప్పులను వివరించారు. అయితే, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో సన్నద్ధంగా ఉన్నామన్నారు.