ఉత్తరప్రదేశ్ ప్రజలను “అవమానించిన” తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు మద్దతు ఎందుకు కోరుతున్నారని బిజెపి నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అఖిలేష్ యాదవ్‌పై మండిపడ్డారు.
గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని జేవార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ, బెనర్జీ మద్దతు కోరుకోవడం ద్వారా అఖిలేష్ “తన స్వంత బలంతో ప్రజల మద్దతు పొందడం లేదని” గ్రహించినట్లు సూచిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి, ఆహారపు అలవాట్లను అవమానించినప్పటికీ యాదవ్ బెనర్జీ నుండి మద్దతు కోరుతున్నారని ఇరానీ విస్మయం వ్యక్తం చేశారు.
“నేను అఖిలేష్ జీని అడగాలనుకుంటున్నాను, ఈ రాష్ట్రపు అద్భుతమైన గతాన్ని మరచిపోయి, రాష్ట్ర వాసులను బహిరంగంగా అవమానించిన వారి మద్దతు కావాలనికోరుతున్న మీకు ఎప్పుడేమయింది? ఎటువంటి వత్తిడి ఎదుర్కొంటున్నారు?” అంటూ ఆమె నిలదీశారు.
అయితే అఖిలేష్ జీ మాత్రం తన సొంత బలంతో తనకు ప్రజల మద్దతు లభించడం లేదనే సంకేతాలను ఖచ్చితంగా ఇస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్‌కు మద్దతుగా జరిగిన సభలో ఇరానీ ప్రసంగీస్తూ ‘సంస్కారం, సంస్కృతి’ని నిర్వచించిన భూమిగా మాత్రమే కాకుండా భారత దేశ అభివృద్ధిని పునర్నిర్వచించే భూమిగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ నుండి పార్లమెంటుకు ఎన్నిక కావడం తన అదృష్టమని అమేథీ లోక్‌సభ ఎంపీ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సింగ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, 70 ఏళ్లలో కూడా చేయలేని పనిని బీజేపీ ఐదేళ్లలో జేవార్‌లో సాధించిందని ఆమెపేర్కొన్నారు .
2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేవార్కి లభించిన పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, “అసెంబ్లీ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించడం లేదా ఆధునిక పరికరాల తయారీకి వైద్య పరికరాల పార్క్‌ను నిర్మించడం అంత సులభం కాదు” అని ఆమె చెప్పారు.
రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల సందర్భంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్లో ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.