కాంగ్రెస్ పార్టీని “అర్బన్ నక్సల్స్” ట్రాప్ చేశారని, వారి “ఆలోచన ప్రక్రియ”ను పట్టణ నక్సల్స్ ప్రభావితం చేస్తున్నారని, వారి ఆలోచనా విధానాన్ని “విధ్వంసకరం”గా మార్చారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన ఆరోపణ చేశారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం, అవినీతి, కుటుంబ ప్రయోజనాలను అందరిపై ఉంచడం, ఇతరుల వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవించడం లేదని ఆరోపిస్తూ ప్రధాని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
రాజ్యసభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ “కాంగ్రెస్‌కు ఉన్న కష్టం ఏమిటంటే, ఓ కుటుంభంకు మించి వారు ఇంకేమీ ఆలోచించలేదు. భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు కుటుంభం పార్టీలని మనం అంగీకరించాలి. ఏ పార్టీలోనైనా కుటుంబమే అత్యున్నతమైనప్పుడు, మొదటి ప్రమాదం ప్రతిభకే” అని మోదీ హెచ్చరించారు.
దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీగా అన్ని పార్టీలలో కూడా ప్రజాస్వామ్య ప్రమాణాలను నెలకొల్పే బాధ్యతను కాంగ్రెస్ వహించాలని ఆయన కోరారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఎత్తిచూపుతూ లోక్‌సభలో గత వారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ దేశం ప్రగతిపథంలో దూసుకుపోతున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ అడ్డంకిగా మారిందని మోదీ ఆరోపించారు.
“కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, వారు దేశ అభివృద్ధిని అనుమతించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వారు ఇప్పుడు దేశం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు” అంటూ ప్రధాని ధ్వజమెత్తారు. దేశం అనే భావన రాజ్యాంగ విరుద్ధమైతే, మీ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్ అని ఎందుకు పిలుస్తారు? దాన్ని కాంగ్రెస్ ఫెడరేషన్‌గా మార్చుకోండి అంటూ హితవు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశానికి ఏమై ఉండేదని అడిగారని ప్రధాని పేర్కొంటూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ కూడా కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ లేకుంటే, “ప్రజాస్వామ్యం కుటుంభ పాలన సంస్కృతి లేకుండా ఉండేది. అక్కడ ఎమర్జెన్సీ మచ్చ ఉండేది కాదు. దేశం దశాబ్దాల అవినీతిని ఎదుర్కొని ఉండేది కాదు” అని ప్రధాని స్పష్టం చేశారు.
అంతే కాదు, కులతత్వ దుశ్చర్యలకు దూరంగా ఉంటుందని, సిక్కు మారణహోమం జరగెడిది కాదని, కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌ను విడిచి పెట్టవలసి వచ్చెడిది కాదని, పంజాబ్ ఏళ్ల తరబడి కాలిపోలేదని కాదని ప్రధాని దుయ్యబట్టారు. ఆడబిడ్డలను ఓవెన్లలో కాల్చిచంపే అవకాశం ఉండెడిది కాదని, ఇంటి రోడ్లు, కరెంటు, నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాల కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడేడిది కాదని ప్రధాని ఎద్దేవా చేశారు.
దాదాపు అందరు కాంగ్రెస్ ఎంపీలు లేచి బయటకు వెళ్లిపోతుండగా, మోదీ వారిపై మరో చురక విసిరారు, “వారు ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం చాలా అలవాటు, ఇతరుల మాటలు వినడం వారికి చాలా కష్టంగా ఉంది” అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఇతరులను వినేలా చేయలేరని, ఇతరుల మాట వినడం కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ దేశానికి పునాదులు వేసిందని, బీజేపీ ఇప్పుడే జెండాను ఎగురవేసిందని సభలో చెప్పారని మోదీ ప్రస్తావిస్తూ “ఇది సభలో జోక్ లాగా చెప్పలేదు. ఇది దేశానికి ప్రమాదకరమైన తీవ్రమైన ఆలోచనల ఫలితం – భారతదేశం 1947లో పుట్టిందని కొందరు నమ్ముతున్నారు. ఈ ఆలోచన వల్ల సమస్యలు తలెత్తుతాయి, ”అని ఆయన హెచ్చరించారు.
ఈ ఆలోచన గత 50 సంవత్సరాలుగా పని చేసే అవకాశాన్ని పొందిన వారి విధానాలపై ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. అది వికృతులకు జన్మనిచ్చింది. ఈ ప్రజాస్వామ్యం మీ ఔదార్యం వల్ల కాదు. 1975లో ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కిన వారు దాని గురించి మాట్లాడకూడదని మండిపడ్డారు.
ప్రభుత్వం చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను తిప్పికొడుతూ, “కొంతమంది జ్ఞాపకశక్తిని సరిదిద్దాలని, వారి జ్ఞాపకశక్తిని పెంచాలని మేము కోరుకుంటున్నాము. కొంతమంది వ్యక్తుల చరిత్ర కేవలం కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమవుతుంది. మేము వారిని మరింత వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నాము… కొంతమందికి, చరిత్ర కుటుంబానికి పరిమితం చేయబడింది. మనం ఏమి చేయగలం?” అని ప్రశ్నించారు.
దేశ భవిష్యత్తు, గర్వించదగిన చరిత్రను మరచిపోవడం సరికాదని మోదీ హితవు చెప్పారు. ఇదివరలో జాతీయ వనరులు కొన్ని కుటుంబాల ఖజానాను నింపడానికి సహాయపడగా, ఇప్పుడు “జాతీయ ఎస్టేట్లు దేశ ఖజానాను నింపుతున్నాయి” అని ఆయన చెప్పారు.
కరోనా మహమ్మారి పరిస్థితిని ప్రభుత్వం నిర్వహించడాన్ని సమర్థిస్తూ, “మహమ్మారి కొనసాగే వరకు, పేదలలోని పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి కట్టుబడి ఉంది” అని మోదీ స్పష్టం చేశారు. కానీ, “కొన్ని రాజకీయ పార్టీలు గత రెండేళ్లలో అపరిపక్వతను ప్రదర్శించాయి. అది దేశానికి హాని కలిగించింది” అని ఆయన చెప్పారు.
కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. వారు “వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం” ప్రారంభించారని గుర్తు చేశారు. “కానీ ప్రజలు వారి మాట వినలేదు. టీకాల కోసం లైన్లలో వేచి ఉన్నారు. దేశ పౌరులు కొంతమంది రాజకీయ నాయకులను దాటి వెళ్లిపోయారు” అని చెప్పారు.