కేసీఆర్ హామీలు పక్కన పెట్టి సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ కాలం నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ధ్వజమెత్తారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో బిజెపి ప్రదర్శించిన దూకుడు చూసి కేసీఆర్ లో వణుకు వచ్చిన్నట్లున్నదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో తప్పు లేదని, వాడిన పదంలో కూడా తప్పు ఏం లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ తెలంగాణ ఇస్తే టి.ఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నారని అరవింద్ గుర్తు చేశారు. రాజకీయ కారణాలతో 1200 వందల మంది యువకులు మృతి చెందారని చెబుతూ డిసెంబర్ 2009 తెలంగాణ ప్రకటన చేసి మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు.
వెనకబడిన 9 జిల్లాలకు ప్రతి ఏడాది రూ 450 కోట్లు వచ్చాయి. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ 2,420 కోట్లను కేంద్రం కేటాయించింది. అయినా కేసీఆర్ తెలంగాణను బిచ్చగాళ్ల పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తోంది, ప్రొజెక్టులు పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారని, కానీ ఇప్పటి వరకు తగిన స్థలం కూడా కేటాయించలేదని విమర్శించారు. ట్రైబల్ యూనివర్సిటీకి రూ 40 కోట్లు కేటాయించారని, అయితే నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైందిని నిలదీశారు. ఇవ్వన్నీ ఇచ్చేలోగా కేసీఆర్, కేటీఆర్ సావు కూడా అవుతోందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరానికి సంబంధించి డి.పి.ఆర్లు ఎందుకు ఇవ్వడంలేదు? మమత బెనర్జీ రేప్ 25 లక్షలు ఇల్లు కట్టింది. నువ్వు కనీసం కేంద్రం డబ్బులు తీసుకోలేదు. ఇచ్చిన డబ్బులకు లెక్క లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌కి తన నియోజకవర్గంలో 5 శాతం ఓట్లు లేవని చెబుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ పదేళ్ళు ప్రభుత్వం అనుభవించి చివరిలో తెలంగాణ ఇచ్చారని అని అర్వింద్ గుర్తు చేశారు. కాంగ్రెస్ దేశమంతా కొట్టుకొని పోతుందని, ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు.