బీజేపీ కార్యకర్తలను నశం పెట్టి కొడుతామని కేసీఆర్ హెచ్చరిస్తారా..కేసీఆర్ నశంపెడితే తాము జండూబామ్ పెడుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. జనగామ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న బండి సంజయ్.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నాడని ధ్వజమెత్తారు.
నోరు తెరిస్తే మందువాసన వచ్చే కేసీఆర్ ను పక్కాగా సభలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపిస్తం అని చెప్పారు. అన్నారు. తాగినట్లు తేలితే… జైలుకు పంపుతామని.. ఆ స్కీం కేసఆర్ కోసం కచ్చితంగా తీసుకొస్తా మని తెలిపారు.
సభ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని సంజయ్ మండిపడ్డారు. సీఎం సభకు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో దాడులు చేయిస్తున్నరని, బీజేపీ కార్యకర్తలు లాఠీలకు, దాడులకు భయపడకుండా బయటకొచ్చి భారతమాతాకీ జై అంటూ జెండా పట్టుకుని వస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే…. నిజాం పాలన మాదిరిగా కేసీఆర్ వస్తుంటే… చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగి వంగి దండాలు పెట్టాలేమో? అని ఎద్దేవా చేశారు. సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలని..డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి ఎంత మందికి ఇచ్చావో చెప్పాలని సవాల్ చేశారు.
సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి కానీ..బీజేపీపై మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు అంటే కేసీఆర్ ఫ్యామీలికి గజగజ అని ధ్వజమెత్తారు.