బిజెపి తీవ్రమైన ఫలితాలు ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, దాని సైద్ధాంతిక మార్గదర్శిగా భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్ ) బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల పట్ల బహిరంగంగా తన అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం ఆసక్తి కలిగిస్తున్నది. ఇప్పటి వరకు ఎక్కువగా `స్నేహపూర్వక సలహాలు’ ఇవ్వడానికి పరిమితం అవుతుండేవారు.
ఆర్ఎస్ఎస్ అత్యున్నత విధాన నిర్ణయ వేదిక, అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) బైఠక్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే మరుసటి రోజు నుండి అహ్మదాబాద్‌లో మార్చి 11-13 మధ్య జరుగనున్నాయి. ఈ వార్షిక సమావేశానికి ముందు, మహిళల వివాహ వయస్సుపై మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టంపై ఆర్ ఎస్ ఎస్ తన బేదాభిప్రాయంను వ్యక్తం చేయడం గమనార్హం. ఇటువంటి సమస్యలను సమాజం నిర్ణయానికి వదిలేయాలని పేర్కొంటూ, ప్రభుత్వ జోక్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
అదేవిధంగా, కర్నాటకలోని హిజాబ్ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడం కూడా అసహనం కలిగిస్తున్నది. కర్నాటకలోని రెండు జిల్లాల్లోని కొన్ని విద్యాసంస్థలకే పరిమితమైన ఒక చిన్న సమస్య ‘జాతీయ సమస్య’లా వ్యాపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అంశాలు, ఇతర సమకాలీన అంశాలతో పాటు అహ్మదాబాద్ భైఠక్ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఆర్ఎస్ఎస్ ప్రతి సంవత్సరం ఎబిపిఎస్ సమావేశాలను నిర్వహించి సంతగత అంశాలతో పాటు భవిష్యత్ కార్యక్రమాలను కూడా నిర్ణయిస్తుంటారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ అగ్రనేతలందరూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల ప్రతినిధులు, 30కి పైగా అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.
ఒక వార్తా కధనం ప్రకారం, వివాహ వయస్సు సమస్య చర్చలో ఉందని, దానిపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఒకరు అంగీకరించారు. ఉదాహరణకు, గిరిజనులలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు త్వరగా జరుగుతాయి.
బాల్య వివాహాల వల్ల బాలికలు తమ చదువుకు స్వస్తి పలుకుతారని, అలాగే చిన్న వయస్సులో గర్భం దాల్చడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.
కానీ, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలనేది ప్రశ్న. కొన్ని విషయాలను సమాజానికే వదిలేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా భావిస్తున్నది. డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తరువాత, ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాల కారణంగా తదుపరి చర్చ కోసం దానిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు.
వైవాహిక అత్యాచారం విషయంలో కూడా ఇదే దృక్కోణం ఉందని, దానిని ఎలా ఎదుర్కోవాలో కుటుంబ సభ్యులకే వదిలేయాలని ఆర్ఎస్ఎస్ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ రెండు సమస్యలు కుటుంబ బంధాల సంస్కృతిని పునరుద్ధరించడం కోసం తాము జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రచారానికి విరుద్ధంగా ఉండవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఆధునిక ఆర్థిక ఒత్తిడి, పాశ్చాత్య ప్రభావం కారణంగా కుటుంభం బంధాలు నిర్వీర్యం అవుతూ ఉండడం పట్ల కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కుటుంబ ప్రబోధన్ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది కుటుంబాన్ని సమాజంలో అత్యంత ముఖ్యమైన యూనిట్‌గా ఉండేటట్లు చూడడం కోసం, ప్రజలను వారి పెద్ద కుటుంబంతో వారంలో కనీసం ఒక రోజు గడపడానికి, కలిసి భోజనం చేసేలా ప్రోత్సహిస్తారు.
ఇటువంటి సామజిక అంశాలపై రాజకీయ చర్చ జరగకూడదని ఆర్ఎస్ఎస్ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. నిస్సహాయ సమాజాలు ప్రతిదానికీ చట్టాలను డిమాండ్ చేస్తాయి. బలమైన సమాజం తనంతట తానే పరిష్కారాన్ని వెతకాలి. తక్కువ ప్రభుత్వంతో పాలన మెరుగుపడితే, సమాజం కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో ఇటీవలి వివాదం చెలరేగడంపై “మేము దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తన ప్రాబల్య పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూస్తున్నప్పటికీ, ఈ విషయం స్థానిక స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం జరిగి ఉండవలసింది మేము విశ్వసిస్తున్నాము. అందుకే సంఘ్ ఈ విషయాన్ని ముందుకు తేవడం లేదు. కానీ మతపరమైన గుర్తింపును ప్రోత్సహించే మార్గాలతో స్థిరంగా రావడం మంచిది కాదన్నది కూడా నిజం” అని భావిస్తున్నారు.
2025లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల గురించి చర్చించనున్నందున ఈ సంవత్సరం సమావేశం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.