ఉక్రెయిన్ పై రష్యా దాడితో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఐరోపాలో తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తన పశ్చిమ పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై రష్యా దాడి సెప్టెంబర్ 1939లో పోలాండ్‌ను ఆక్రమించిన నాజీ జర్మనీని గుర్తు చేస్తున్నది. పుతిన్ ఉక్రెయిన్ తో ఆగిపోతారా, లేదా రాబోయే రోజులలో పోలాండ్ వంటి దేశాలపై కూడా నాటో నుండి నిష్క్రమించామని వత్తిడి చేస్తూ దాడులకు దిగుతారా అని మొత్తం ఐరోపా వణికి పోతున్నది.
ఆసియా, పసిఫిక్‌లను చుట్టుముట్టిన రెండవ ప్రపంచ యుద్ధంలో 40 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో, అలాంటి పీడకల మళ్లీ మళ్లీ రాదని అందరూ భావించారు. ఉక్రెయిన్‌లో రష్యా జోక్యాన్ని మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా చిత్రించడం అతిశయోక్తి కావచ్చు.
కానీ పశ్చిమ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సైన్యం, వైమానిక శక్తి పోలాండ్, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, రుమానియాలో ఉండడం రష్యాకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎప్పుడైనా, ఎటువంటి చిన్న సంఘటన అయినా ప్రళయాగ్నిగా రగిల్చే అవకాశం లేకపోలేదు. ఆధునిక ఆయుధాలు, యుద్ధవిధానంలో ఎదురుపడి ఘర్షణకు తలబడ వలసిన అవసరం లేదు.
రిమోట్ గా దాడులు చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్ను చుట్టుముట్టిన లక్ష మంది రష్యన్ సైనికుల నేపథ్యంలో చెల్లాచెదురుగా ఉన్న 40,000 మంది నాటో పేలవంగా కనిపించవచ్చు. మానవశక్తి నిరాడంబరంగా ఉంది. అయితే క్రిమియాను 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత స్థాపించిన వెరీ హై రెడినెస్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఉక్రెయిన్ నియంత్రణలో ఉండడం గమనార్హం.
గత కొన్ని నెలలుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రేనియన్ సరిహద్దు, తీరం వెంబడి సాయుధ దళాలను సేకరించడం వెనుక గల ఉద్దేశ్యాలపై పశ్చిమ దేశాలు ఒక నిశ్చితాభిప్రయంకు రాలేకపోయాయి. ఇది గన్‌బోట్ దౌత్యం అని కొందరు భావించారు. సైనికులు సరిహద్దును దాడి ఉక్రెయిన్ లోకి ప్రవేశిస్తారని ఎవ్వరు ఊహించలేదు.
అయితే అమెరికా నిఘా సంస్థలతో పాటు పలువురు నిపుణులు ఉక్రెయిన్ సరిహద్దులో బెదిరింపులతో ఆగిపొరని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 21న, ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటు ప్రాంతాలు – ముఖ్యంగా డొనెట్స్క్, లుహాన్స్క్ – తమను రక్షించడానికి రష్యా ప్రభుత్వాన్ని ఆహ్వానించినట్లు టెలివిజన్ లో ప్రకటించడం ద్వారా పుతిన్ తన ఉద్దేశ్యాన్ని బహిరంగ పరచారు.
ఈ ప్రాంతాలకు ‘శాంతి పరిరక్షక’ విభాగాలను పంపుతున్నట్లు ప్రకటిస్తూ “మన చారిత్రక భూభాగాలపై రష్యా పట్ల శత్రుత్వం సృష్టిస్తున్నారు (అంటే సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్ రష్యాకు చెందినది). ప్రత్యేక సైనిక చర్యను నిర్వహించాలని మనం నిర్ణయం తీసుకున్నాము’ స్పష్టం చేశారు. ఇది ఉక్రెయిన్ ‘సైనికీకరణ, నిర్మూలన’ కోసం అని ఆయన వాదించారు. కైవ్ ప్రభుత్వం తీవ్రవాద పాలన అని రష్యా చాలా కాలంగా ఆరోపిస్తోంది.
ఇంకా ఇలా ప్రకటించాడు: ‘ఉక్రెయిన్ను ఆక్రమించాలనే ఉద్దేశం మనకు లేదు.’ కానీ గతంలో సోవియట్ యూనియన్ ను ఉక్కిరిబిక్కిరి కావించిన తూర్పు ఐరోపా దేశాలకు చాలా ఆందోళన కలిగించే సందేశంలో, ఆయన ఇలా హెచ్చరించాడు: ‘బయటి నుండి జోక్యం చేసుకోవాలని భావించే ఎవరికైనా: మీరు అలా చేస్తే, మీరు చరిత్రలో ఎదుర్కొన్న దానికంటే గొప్ప పరిణామాలను ఎదుర్కొంటారు.’
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటలకు, రాజధాని నగరం కైవ్‌తో సహా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలకు సమీపంలో పేలుళ్లు వినిపించాయి. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు తమ గడ్డపై దిగాయని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి పేర్కొన్నారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఇలా అన్నారు: ‘పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించాడు. శాంతియుతమైన ఉక్రేనియన్ నగరాలు దాడులకు గురవుతున్నాయి. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటుంది. ప్రపంచం పుతిన్‌ను ఆపగలదు.’
1939లో, పోలాండ్‌పై జర్మనీ దాడి చేస్తే బ్రిటీష్, ఫ్రెంచ్ సైనిక మద్దతుకు హామీ ఇచ్చింది. అడాల్ఫ్ హిట్లర్ దురాక్రమణ రహిత ఒప్పందంతో పోలాండ్‌ను రక్షించడానికి వచ్చిన సోవియట్ యూనియన్ను తటస్థీకరించాడు. ఆ తర్వాత జరిగిన మెరుపుదాడి నుండి పోలాండ్‌ను రక్షించడంలో బ్రిటన్, ఫ్రాన్స్ విఫలమయ్యాయి.
రష్యా తన సార్వభౌమత్వంపై దాడి చేస్తే విస్మరిస్తే అండగా వస్తామని ఉక్రెయిన్ కూడా తన సహాయానికి రావడం గురించి అమెరికా, యుకెలు భరోసా ఇచ్చాయి. కానీ ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకున్న తర్వాత అమెరికా యుద్ధాలతో అలసిపోయింది. రష్యా వంటి శక్తివంతమైన శత్రువుపై సుదూర ప్రదేశంలో మరొక యుద్ధంలో పాల్గొనే సాహసం చేయలేదు.
బ్రిటన్ పూర్తిగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అవినీతి, చట్టాన్ని ఉల్లంఘించే ఆరోపణల నుండి తన రాజకీయ జీవితం కాపాడుకొనే ప్రయత్నంలో వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం మినహా ఉక్రెయిన్ ను ఆదుకొనే పరిస్థితుల్లో లేరు.
యూరోపియన్ యూనియన్, అమెరికా ప్రకటించిన ఆంక్షలతో పోల్చితే బ్రిటన్ ప్రకటించిన ఆంక్షలు చాలా పేలవంగా ఉన్నాయి. , లండన్‌లోని రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన వివాదాస్పద రష్యన్ ఒలిగార్చ్లకు బ్రిటన్ సురక్షితమైన స్వర్గధామం. వారు జాన్సన్ కు చెందిన పాలక కన్జర్వేటివ్ పార్టీకి మిలియన్ల పౌండ్లను కూడా విరాళంగా ఇచ్చారు. అందుకని రష్యా పై కఠినంగా ఆర్ధిక ఆంక్షలను అమలు పరచడం కష్టం కాగలదు.
రెండవ ప్రపంచ యుద్ధంలో, సోవియట్ యూనియన్, అమెరికా హిట్లర్‌ను ఎదిరించడానికి మిత్రదేశాలుగా మారాయి. కానీ 1962లో, ప్రచ్ఛన్నయుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో, ఇటలీ, టర్కీలలో వాషింగ్టన్ క్షిపణుల మోహరించినప్పుడు మాస్కో కూడా ఫిడేల్ కాస్ట్రో అభ్యర్థన మేరకు క్యూబాలో అదే పని చేయడం ద్వారా అమెరికాకు పెద్ద సవాల్ విసిరింది.
ఫలితంగా, సోవియట్ క్షిపణులు అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, సోవియట్ ప్రీమియర్ నికితా క్రుష్చెవ్ సంక్షోభాన్ని చల్లార్చడానికి ముందు యుద్ధం జ్వాలలు రాజుకున్నాయి.
గందరగోళానికి గురైన రెండు ప్రధాన సైనిక శక్తులు ఒక అలిఖిత అవగాహనకు వచ్చాయి. పరస్పరం సైనికంగా సమీపంలోకి రావద్దని నిర్ణయించుకున్నాయి. అప్పటికే అమెరికా ఞత్రుత్వంలోని నాటో పశ్చిమ ఐరోపాలో పాతుకుపోగా, 1989లో సోవియట్ యూనియన్ పఠనం అనంతరం తూర్పుగా విస్తరించే సాహసం చేసింది.
పుతిన్ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కెజిబి యుద్ధ వీరుడు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంపై రాజీపడే ప్రసక్తి లేదని తరచూ సంకేతం ఇస్తూ వస్తున్నాడు. ఈ విషయమై స్పందించే సామర్ధ్యం గత మూడు దశాబ్దాలుగా రష్యాకు లేకపోయింది. ఇప్పుడు కూడా పశ్చిమ దేశాలు, చైనాలతో పోల్చితే రష్యా ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా లేదు. అయితే సైనికంగా పటిష్టమైంది. దాని సైబర్ సామర్ధ్యం ప్రాణాంతకంగా మారింది.
కాబట్టి, అతని పుతిన్ అసలు ఎత్తుగడ ఏమిటి? ప్రస్తుత దాడి ద్వారా ఏమి సాధించాలని ఆశిస్తున్నాడు? అతని డిమాండ్లలో ప్రధానం సోవియట్ అణ్వాయుధాలు నెలకొన్న ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం పొందకపోవడంతో బాటు తిరిగి రష్యా ప్రభావంలోకి రావాలి. అంటే అమెరికా ప్రభావం నుండి వైదొలగాలి.
మాస్కో అనుకూల వేర్పాటువాదంకు మెజారిటీ మద్దతు లేకపోయినప్పటికీ, ఉక్రెయిన్‌లో కూడా వాస్తవం. క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్‌లతో పాటు, ఒడెస్సా కూడా కైవ్ ప్రభుత్వ ధోరణి హానికరంగా భావిస్తున్నాయి. కైవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన 2014 ఒపీనియన్ పోల్, ఈ ప్రాంతాలలో ఎక్కువ మంది ఉక్రెయిన్ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారని, అయితే రష్యాతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకొంటున్నట్లు వెల్లడించింది.
అయితే, పుతిన్ ఈ సమస్యకు పరిష్కారంకోసం బలప్రయోగంకు తలపడ్డారు. పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలను పరిగణనలోకి తీసుకున్నాడు. అయితే ఆంక్షలు రష్యాకు కాకుండా అంతర్జాతీయ వాణిజ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. నేడు ప్రపంచం అందుకు సిద్ధంగా లేదు. పుతిన్ రష్యా బలప్రయోగానికి పూనుకోవడం అతని దేశంలోని జాతీయవాదులను సంతోషపరుస్తుంది. తక్షణం దౌత్యపరమైన పరిష్కారం సాధ్యం కాకపోయినా, మధ్యస్థ కాలంలో తోసిపుచ్చలేము.