ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలో కొనసాగితే, ఉష్ణ్నోగత 30 డిగ్రీల సెల్సియస్ దాటి పోయి దేశంలో పలు ప్రాంతాలు ప్రమాదంలో పడతాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి) తాజా నివేదిక హెచ్చరించింది.
లక్నో, పాట్నాలలో ఉష్ణ్నోగత 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చనని నివేదిక అంచనా వేసింది. అలాగే, భువనేశ్వర్, చెన్నై, ముంబై, ఇండోర్, అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు 32-34 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది.
మొత్తం మీద, అస్సాం, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ చాలా తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని నివేదిక అంచనా వేసింది.
సున్నితంగా ఉండే పర్యావరణ శాస్త్రం కారణంగా వాతావరణంలో స్వల్ప మార్పు కూడా హిమాలయ ప్రాంతంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంవత్సరం హిమాచల్, ఉత్తరాఖండ్‌లో మేము చూసిన చమోలీ విపత్తు, భారీ వర్షపాతం వంటి విపరీత వాతావరణ సంఘటనలు వంటి సంఘటనలు మరింతగా పెరుగుతాయి’ అని భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్, ఈ నివేదిక ప్రధాన రచయిత అంజల్ ప్రకాష్ తెలిపారు
అమలు కాని భారత్ లక్ష్యాలు
2070 నాటికి భారతదేశం జీరో ఉద్గారాలను సాధిస్తుందని, అంటే నికర కర్బన ఉద్గారాలు ఉండవని గతేడాది గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
2030 నాటికి భారతదేశం తన విద్యుత్‌లో 50 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుండి పొందేలా చూస్తుందని, 2030 వరకు కర్బన ఉద్గారాలను ఒక బిలియన్ టన్నులు తగ్గిస్తుందని, జిడిపిలో ఒక యూనిట్‌కు దాని ఉద్గారాల తీవ్రతను 45 శాతం కంటే తక్కువగా తగ్గిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.
అలాగే 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని వ్యవస్థాపిస్తుందని కూడా చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని నివేదిక తెలిపింది. ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని నివేదిక అంచనా వేసింది.