మహిళలను అవమానించి సీఎం కేసీఆర్ పైశాచిక ఆనందం పొందుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఈసారి తన శాడిస్ట్ మనస్తత్వానికి ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై గారిని లక్ష్యంగా చేసుకున్నారని అంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆమె లేకుండా బడ్జెట్ సమావేశాలు జరపాలనుకోవడమే కాకుండా, గత నెలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవం రోజున కూడా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రాజ్‌భవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా గవర్నర్ గారిని అవమానించారని ఆమె గుర్తు చేశారు.
మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆడబిడ్డ దేవతల జాతరలో కూడా మహిళా గవర్నర్ అయిన తమిళిశై గారిని ప్రోటోకాల్ ఉల్లంఘనతో అవమానించారని ఆమె ధ్వజమెత్తారు. గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు… వీడ్కోలు చెప్పేందుకు ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ రాలేదు. మేడారంలో గవర్నర్ ఉన్నంత సేపు మంత్రులు, అధికారులు కనిపించలేదని ఆమె గుర్తు చేశారు.
ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయిని, అయినా కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. గవర్నర్ గారి పర్యటన రోజున… ఆ ఉదయం వరకూ మంత్రులు అక్కడే ఉన్నరు. కానీ, తమిళిసైగారు వచ్చే సమయానికే ఎలా మాయమయ్యారు? అని విజయశాంతి ప్రశ్నించారు.
వీరంతా గవర్నర్ గారి పట్ల ఇలా ప్రవర్తించేలా ఎవరు పురికొల్పారో అందరికీ తెలుసని ఆమె దుయ్యబట్టారు. ఈ చర్యలన్నీ తమిళ ఆడబిడ్డలు సహా యావత్ మహిళా లోకాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ఒకపక్క తమిళ ఆడపడుచు అయిన ఈ మహిళామూర్తిని ఘోరంగా అవమానిస్తున్న కేసీఆర్ గారు… ఏ ముఖంతో తమిళనాడు సీఎంతో ఫ్రంట్ పేరు చెప్పి మీటింగులు చేస్తున్నరు? తమిళ ప్రజలేమీ అమాయకులు కారుని ఆమె హెచ్చరించారు.
మహిళల పట్ల తొలి నుంచీ కేసీఆర్ వివక్షతోనే వ్యవహరిస్తూ వస్తున్నరని విజయశాంతి ఆరోపోయించారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని ఆమె గుర్తు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు కేబినెట్‌ను విస్తరించకాకుండా, పలు విమర్శల నేపథ్యంలో మాత్రమే ఈ విస్తరణలో పేరుకు ఇద్దరు మహిళలకి మంత్రి పదవులిచ్చారమొ ఆ,ఏ సీజే[[వారి.
గతేడాది ఫిబ్రవరి నెలలో జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను కుక్కలు అని దూషించిన కేసీఆర్ వ్యాఖ్యలను మహిళాలోకం మర్చిపోలేదని ఆమె స్పష్టం చేశారు. మహిళల ఇలా వ్యవహరించే కేసీఆర్ గారు… చట్ట సభల నిర్వహణలో రూల్స్ పాటిస్తారనుకోవడం పొరపాటని తెలిపారు.