అంతర్జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు సందీప్ సింగ్ (40) ను దుండగులు తుపాకులతో కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని జలందర్ జిల్లాలో చోటుచేసుకుంది. మలియన్ ఖుర్ద్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుండగా అక్కడి నుంచి పక్కకు వచ్చిన సందీప్‌ను నలుగురు తుపాకులతో కాల్చిచంపారు.
వెంటనే సందీప్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. సందీప్ తల, ఛాతీ భాగంలో 8 నుంచి 10 బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
జలంధర్ డిఎస్పి లక్విందర్ సింగ్ మాట్లాడుతూ జలందర్‌లోని షాకోట్ సమీపంలో నంగల్ అంబియన్ గ్రామానికి చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారని తెలిపారు. అతనికి ఆ దేశ పౌరసత్వం ఉందని చెప్పారు. తరచుగా ఆయన కబడ్డీ టోర్నమెంట్లు నిర్వహిస్తాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అతను కబడ్డీ ప్రపంచాన్ని సందీప్ దశాబ్దానికి పైగా శాసించాడు. పంజాబ్ లోనే కాకుండా కెనడా, యూఎస్ఏ, యూకేలలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కబడ్డీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సందీప్ అద్భుత విజయాలతో కబడ్డీ ప్రపంచంలో తన పేరును చిరస్థాయిగా నిలిచాడు.
అద్భుతమైన క్రీడా నైపుణ్యం కలిగిన సందీప్‌ను అప్పట్లో డైమండ్ పార్టిసిపెంట్‌గా పిలిచేవారు. హత్యకు గురికావడానికి ముందు కబడ్డీ ఫెడరేషన్‌ను నిర్వహించేవాడు. కాగా, సందీప్‌కు, గోల్ఫ్ ఎక్విప్మెంట్, ఫెడరేషన్తో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యకు అది కూడా కారణమై ఉంటుందని భావిస్తున్నారు.