కేసీఆర్గడీలు బద్దలు కొడతాం, కుటుంబ పాలనను తరిమికొడతాం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను గురువారం జోగులంబ అలంపూర్ నుండి ప్రారంభించారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిందని చెప్పారు.
బీజేపీ అలా కాదని, అంబేద్కర్ జయంతి రోజే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదో శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి గుడి అభివృద్ధిని కేసీఆర్ విస్మరించాడని, ఆయనకు అమ్మవారంటే భయం లేదని సంజయ్ ధ్వజమెత్తారు.
తొలిరోజు బండి సంజయ్ నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇమాంపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో రాత్రి నిద్ర చేశారు. అంతకు ముందు జోగులాంబ అమ్మవారికి పూజలు చేసి అలంపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు దళితులన్నా, అంబేద్కర్ అన్నా గౌరవం లేదని విమర్శించారు.
అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కూడా బయటకు రాడని, దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశాడని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
బీజేపీ అలా కాదని, అంబేద్కర్ జయంతి రోజే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదో శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి గుడి అభివృద్ధిని కేసీఆర్ విస్మరించాడని, ఆయనకు అమ్మవారంటే భయం లేదని సంజయ్ ధ్వజమెత్తారు.
‘‘కేసీఆర్.. నువ్వు ఈ నడిగడ్డ మీద పాదయాత్ర చేసినవ్.. కానీ ఆర్డీఎస్ను ఎందుకు ఆధునీకరించలేదు.. ఆలంపూర్లో కనీసం బస్టాండ్ లేదు. కాలేజీ లేదు.. హాస్పిటల్ లేదు.. ఇక్కడి వాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పక్కన ఉన్న కర్నూల్ పోతున్నారు. కేసీఆర్ చెప్పేటోడే తప్ప ఏ పనీ చేయడు’’ అని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందని, ప్రజలు కోరుకుంటున్నవన్నీ అమలు చేస్తామని భరోసా వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ ప్రజలను ఎలా వంచిస్తున్నాడో వివరించేందుకే ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పాడని, కానీ ఆయన మెడలు వంచి వరి కొనిపిస్తామన్న ప్రకటన చేయించిన ఘనత బీజేపీకే దక్కుతుందని సంజయ్ పేర్కొన్నారు. ‘‘ఓసారి సన్న వడ్లు వేయవద్దంటడు. ఓసారి దొడ్డు వడ్లు వేయవద్దంటడు. పత్తి వేయవద్దంటడు. మొన్నటి దాకా క్వింటాల్‌కు రూ.5 వేలు ఉన్న పత్తి ఇయ్యాల రూ.10 వేలు అయింది. మిర్చి రేటు కూడా పెరుగుతోంది. ఈ ఘనత మోదీది కాదా?’’ అని ప్రశ్నించారు.
రైతులకు ఏదో చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న సీఎం గడిచిన ఏడేండ్లలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికలు వస్తేనే హామీలతో మైమరిపించడం, తర్వాత మరిచిపోవడం సీఎంకు అలవాటేనని సంజయ్ విమర్శించారు.
‘‘అంబేద్కర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు అవమానించింది. కానీ ఆయన జన్మించిన, గతించిన, నడయాడిన ప్రాంతాలను పంచ తీర్థాల పేరుతో బీజేపీ అభివృద్ధి చేస్తోంది. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత మా పార్టీకే దక్కుతుంది” అని సంజయ్ తెలిపారు. దళితులకు మూడెకరాలు ఎందుకియ్యలేదో, దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో కేసీఆర్‌ను ఎవ్వరూ దేకలేదని, దీంతో ఆయనకు చిప్పు దొబ్బిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. ఢిల్లీలో దీక్ష చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో పెట్టె బేడ సర్దుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చాడని ఆమె ఎద్దేవా చేశారు. వరి వేస్తే ఉరి అనడంతో చాలా మంది రైతులు వేయలేదని, వరి వేసిన కొందరి నుంచి కూడా కేసీఆర్ వడ్లు కొనలేదని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికే దళారులకు అగ్గువకు వడ్లు అమ్ముకొని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాళా తీసిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలిచావులు, ఆత్మహత్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను అంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ లంక కొట్టుకుపోతుందని చెప్పారు. టీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ ముందుకు పోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజల గొంతుకగా మారిందని, ప్రతి ఒక్కరూ తమ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు.
అవినీతి సీఎంను ఇంటికి పంపాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ, ఆర్డీఎస్ ఆధునీకరణ పూర్తయితే ఆయకట్టుకు నీళ్లు అందేవని పేర్కొన్నారు. కమీషన్ల కోసమే లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులను రూ.60 వేల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
భవిష్యత్తు అంతా బీజేపీదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అగ్గి రగిలిందని, దాన్ని ఆపే శక్తి కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యం సీసాలను లేదని తేల్చి చెప్పారు. నియంతృత్వం త్వరలోనే మట్టిలో కలుస్తుందని, తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు రాజకీయ సమాధి కట్టేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు.
‘‘కేసీఆర్‌ను గద్దె దించుతామని జోగులాంబ అమ్మవారి సాక్షిగా ఆన తీసుకోవాలి.. కేసీఆర్ గద్దె దిగితేనే మన బతుకులు మారుతాయి” అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా ఏ ఒక్క సమస్యా పరిష్కరించలేదని ఆమె విమర్శించారు. న్నారు. కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. నడిగడ్డ పోరాటాల అడ్డా అని, నీళ్ల కోసం రాయలసీమ వాసులను ఎదుర్కొన్నామని చెబుతూ అలాంటి గడ్డ నుంచి టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.