బండి సంజయ్ ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని మండిపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు బహిరంగ లేఖ వ్రాసారు. పాలమూరులో అడుగుపెట్టే హక్కు బండి సంజయ్ కు లేదని కెటిఆర్ హెచ్చరించారు.
కృష్టా జలాల్లో వాటా తేల్చకుండా జల దోపిడికి జై కొడతారా.? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు చేసిన వాళ్లు.. ఇప్పుడు కపట యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా?” అంటూ కేటీఆర్ నిలదీశారు.
” పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా?…పాలమూరు ఎత్తి పోతల పథకానికి జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదు?.. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో? సమాధానం చెప్పాలి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడుగడుగునా అన్యాయం… తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ అంటూ మంత్రి విరుచుకుపడ్డారు. బిజెపికి విభజన హామీలు నెరవేర్చే తెలివి లేదని మంత్రి ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ చెప్పినా.. నిధులిచ్చే నీతి లేదని కెటిఆర్ ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తారా ? అని నిలదీశారు.
తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బిజెపి అటు కేటీఆర్ దుయ్యబట్టారు. కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు చేస్తే ఏం లాభామని అడిగారు. పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.