2013-18 కాలంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకర్తలపై పోలీసు కేసులను ఉపసంహరించుకోవడాన్ని 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ వివాదంగా ప్రస్తావించేందుకు బిజెపి సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంతో వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి.
ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూపుతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించడాన్ని బిజేపికి ప్రధాన అస్త్రం దొరికినట్లయింది. అయితే, పిఎఫ్ఐ నిజంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతోందని భావిస్తే, పిఎఫ్ఐని నిషేధించేందుకు బలమైన చర్య కేంద్రం, రాష్ట్రాలలో అధికారమలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయని అంటూ కాంగ్రెస్ బిజెపి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నది.
దక్షిణ భారతదేశంలోని మూడు ముస్లిం సంస్థలు, కేరళలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్, కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరై విలీనం ద్వారా పిఎఫ్ఐ ను 2007లో ఏర్పాటు చేశారు. నవంబర్ 2006లో కేరళలోని కోజికోడ్‌లో జరిగిన సమావేశంలో ఈ మూడు సంస్థలను ఒకచోట చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 16, 2007న “ఎంపవర్ ఇండియా కాన్ఫరెన్స్” అని పిలవబడే సమయంలో బెంగళూరులో జరిగిన ర్యాలీలో దీని ఏర్పాటు అధికారికంగా ప్రకటించారు.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధం తర్వాత ఉద్భవించిన పిఎఫ్ఐ, మైనారిటీలు, దళితులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడే సంస్థగా తనను తాను చెప్పుకుంటున్నది. అయితే, ముస్లింల మద్దతు కూడగట్టేందుకు ఈ ప్రధాన స్రవంతి పార్టీలు పిఎఫ్ఐతో కుమ్మక్కయ్యాయని ఒకరినొకరు ఆరోపించుకున్నప్పటికీ, కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఇది తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నది.
పీఎఫ్ఐ ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. హిందూ సమాజంలో ఆర్ఎస్ఎస్ , వి హెచ్ పి, హిందూ జాగరణ వేదిక వంటి సంస్థలకు ముస్లింలలో సామాజిక మరియు, ఇస్లామిక్ మతపరమైన కార్యక్రమాలను పిఎఫ్ఐ చేబడుతున్నది. అయితే ఈ సంస్థ నిర్దిష్ట చట్టపరిధిలో పనిచేయక పోవడంతో అరెస్టులు చేసిన తర్వాత సంస్థపై నేరారోపణ చేసి, చట్ట అమలు ప్రభుత్వ ఏజెన్సీలకు సాధ్యం కావడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
2009లో, ముస్లింలు, దళితులు, ఇతర అట్టడుగు వర్గాల రాజకీయ సమస్యలను చేపట్టే లక్ష్యంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) అనే రాజకీయ సంస్థ పిఎఫ్ఐ నుండి ఉద్భవించింది. దీని ప్రకటిత లక్ష్యం “ముస్లింలు, దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలతో సహా పౌరులందరి అభివృద్ధి, ఏకరీతి అభివృద్ధి”, “పౌరులందరికీ అధికారాన్ని పంచుకోవడం”. అయితే ఇది రాజకీయ కార్యక్రమాలకు కేవలం ఒక వేదికవలె పరిమితమవుతూ మొత్తం కార్యనిర్వహణలో పిఎఫ్ఐ కీలక భూమిక వహిస్తున్నది.
ఈ సంస్థలు ప్రధానంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయి. ఎస్‌డిపిఐ కోస్తా దక్షిణ కన్నడ, ఉడిపిలో మాత్రమే ఉనికిని కలిగి ఉంది. ఇక్కడ గ్రామం, పట్టణం, నగర కౌన్సిల్లకు స్థానిక ఎన్నికలలో విజయం సాధించగలిగింది.
2013 వరకు, స్థానిక ఎన్నికలలో మాత్రమే పోటీ చేయగా రాష్ట్రంలోని 21 పౌర నియోజకవర్గాలలో సీట్లను గెలుచుకుంది. 2018 నాటికి 121 స్థానిక సంస్థల స్థానాలను గెలుచుకుంది. 2021లో, ఇది ఉడిపి జిల్లాలో మూడు స్థానిక కౌన్సిల్‌లను స్వాధీనం చేసుకుంది.
2013 నుండి, కర్ణాటక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టడం ప్రారంభించింది. 2013 రాష్ట్ర ఎన్నికలలో మైసూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన నరసింహరాజా స్థానంలో రెండవ స్థానంలో నిలిచింది. 2018లో, 20 శాతానికి పైగా ఓట్లను సాధించి, 2014,2019 లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ కన్నడ స్థానం కోసం పోటీ చేయగా, అయితే వరుసగా 1 శాతం, 3 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది.
మూడు ప్రధాన పార్టీలు – కాంగ్రెస్, బిజెపి, జెడిఎస్ మద్దతుదారులపై ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నమోదైన చిన్న చిన్న కేసులను తరచుగా ఉపసంహరిస్తున్నారు. మత కలహాల సమయంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు ఆరోపించిన కేసులు, ఆందోళనల సమయంలో రైతులు, కన్నడ అనుకూల కార్యకర్తలపై నమోదైన కేసులను సాధారణంగా ఉపసంహరిస్తున్నారు.
2008, 2013 మధ్య బిజెపి అధికారంలో ఉన్నప్పుడు, దక్షిణ కన్నడలో చర్చిలపై దాడులకు పాల్పడిన సంఘ్ పరివార్ సభ్యులపై కేసులు, దాడుల సమయంలో ప్రతిచర్య హింసకు క్రైస్తవులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత బిజెపి ప్రభుత్వ హయాంలో మతపరమైన విధ్వంసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌డిపిఐ, పిఎఫ్ఐ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులను ఎత్తివేసింది.
2008-13 మధ్య కాలంలో 1,600 మంది పిఎఫ్ఐ కార్యకర్తలపై బిజెపి ప్రభుత్వం దాఖలు చేసిన మొత్తం 176 కేసులను ఎత్తివేయడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కేసులు శివమొగ్గ (2015 నుండి 114 కేసులు), మైసూరు (2009 నుండి 40 కేసులు), హసన్ (2010 నుండి 21 కేసులు), కార్వార్ (2017లో 1 కేసు)లో నిరసనలు, మతపరమైన ఘర్షణలకు సంబంధించినవి.
ఆగస్ట్ 31, 2020 న, బీఎస్ యడియూరప్ప ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం 312 మంది వ్యక్తులపై 62 కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఈ కేసుల్లో చాలా వరకు మతపరమైన సంఘటనల సమయంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ నిషేధాజ్ఞలను ఉల్లంఘనకు సంబంధించినవి. 2020లో కేసులు ఎత్తివేసిన వారిలో మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కూడా ఉన్నారు.
పిఎఫ్ఐ ను భారత ప్రభుత్వం నిషేధించనప్పటికీ, దాని ముస్లిం అనుకూల వైఖరి కారణంగా బిజెపి, ఇతర హిందుత్వ సంస్థలు తీవ్రవాద సంస్థగా పేర్కొంటూ వస్తున్నారు. కర్ణాటకలో, పిఎఫ్ఐపై నిషేధం విధించాలని పలు హిందుత్వ సంస్థలు తరచూ కోరుతూనే ఉన్నాయి. అయితే, 2007 నుంచి కర్ణాటకలో పీఎఫ్ఐపై నమోదైన 310కి పైగా కేసుల్లో కేవలం ఐదుగురిలో మాత్రమే శిక్షలు పడ్డాయి. పిఎఫ్ఐ సభ్యులపై ఆరోపించిన రాజకీయ హింసకు సంబంధించిన కొన్ని ప్రధాన సంఘటనలు:
* 2016లో బెంగుళూరులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆర్ రుద్రేష్ హత్య, దీనిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) పిఎఫ్ఐ బెంగళూరు యూనిట్ అధ్యక్షుడు అసిమ్ షరీఫ్‌ను నిందితుడిగా పేర్కొంది.
* అలాగే 2016లో, మైసూరు పోలీసులు, భజరంగ్ దళ్ కార్యకర్త కె రాజు హత్యకు పిఎఫ్ఐతో సంబంధాలున్న యువకుడు అబిద్ పాషాను అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో జరిగిన ఆరు మతపరమైన ప్రేరేపిత హత్యలలో పాషా ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపించారు.
* 2017లో, జిల్లాలోని బంట్వాల్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శరత్ మడివాలా (28)పై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరు పిఎఫ్ఐ కార్యకర్తలను దక్షిణ కన్నడలో పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌డిపిఐ కార్యకర్త అష్రఫ్ కలై హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
* 2019లో నరసింహరాజా నుండి బహుళ-పర్యాయాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తన్వీర్ సైత్‌ను హత్య చేసేందుకు ఎస్‌డిపిఐకి సంబంధించిన వ్యక్తులు నిందితులుగా ఉన్నారు.
ఎస్‌డిపిఐ కాంగ్రెస్‌కు సమానంగా ఓటర్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇది మతపరమైన సమీకరణ గల ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ కన్నడ వంటి ఎన్నికల ఫలితాలను ముస్లిం ఓట్లు సమీకరించగల ప్రాంతాలలో పరోక్షంగా బిజెపికి సహాయం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
అయితే, 2018 ఎన్నికలకు ముందు, దక్షిణ కన్నడలోని బంట్వాల్, మంగళూరు సిటీ నార్త్, బెంగళూరులోని సర్వజ్ఞనగర్, హెబ్బల్ వంటి నియోజకవర్గాల నుండి అభ్యర్థులను ఉపసంహరించుకోవడానికి ఎస్‌డిపిఐతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు.
బీజేపీకి విధేయత చూపిన మాజీ కాంగ్రెస్ నాయకుడు రోషన్ బేగ్ గతంలో కాంగ్రెస్‌కు ఎస్‌డిపిఐ, పిఎఫ్ఐలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే, బేగ్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, శోభా కరంద్లాజే వంటి బిజెపి నాయకులు ఎస్‌డిపిఐతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించారు.