భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం, పూర్తి భావప్రకటన స్వేచ్ఛ ఉన్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీనివల్ల ఒక్కోసారి కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలూ వినిపిస్తుంటాయనితెలిపా రు. ఖతర్‌లో మూడు రోజుల పర్యటనను ముగించుకుని మంగళవారం ఢిల్లీకి బయలుదేరేముందు స్థానికంగా ఉన్న ప్రవాసీ తెలుగు ప్రముఖలతో వెంకయ్య కొద్దిసేపు సమావేశమయ్యారు.
అంతకుముందు సోమవారం రాత్రి ఖతర్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించీ ఆయన మాట్లాడారు. భారత్‌లో అన్ని వర్గాలకు, మతాలకు సమాన స్వేచ్ఛ ఉందని, ఎవరి పట్ల ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. అందరికీ సమాన న్యాయమనేది భారతీయ సంస్కృతి అని పేర్కొన్నారు.
ముస్లిం అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను గతంలో రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని వెంకయ్య నాయుడు గుర్తు చేశా రు. ముస్లింలు, హిందువులు, కైస్త్రవులు అంటూ మతాల ఆధారంగా కాకుండా అందరినీ భారతీయులుగానే వ్యవహరిస్తామని చెప్పారు. ఏ ధర్మం వారైనా అందరూ భారత మాత ముద్దుబిడ్డలేనని స్పష్టం చేశా రు.
కాగా, మాతృభాష అనేది సొంత కన్ను లాంటిదని, పరాయి భాష కళ్లజోడులాంటిదని ఉపరాష్ట్రపతి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్నా భారతీయులు తమ మాతృభాషలోనే మాట్లాడాలని ఆయన సూచించారు. లెర్న్, ఎర్న్, రిటర్న్ అనే మూడు అంశాలను యువత గుర్తుంచుకోవాలని, నేర్చుకుని సంపాదించుకుని మాతృభూమికి తిరిగి రావాలని సూచించారు.
వెంకయ్యనాయుడు కొద్దిసేపు తెలుగులో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు యువకులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మజ్లిస్ షురా స్పీకర్ హసన్ అబ్దుల్లా అల్ ఘనీతో వెంకయ్య భేటీ అయ్యారు. వెంకయ్య తొమ్మిది రోజులపాటు మూడు దేశాల పర్యటనను ముగించుకొని భారత్‌కు బయలుదేరేముందు ఆయనకు ఖతర్ ప్రభుత్వం పక్షాన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీ వీడ్కోలు పలికారు.
1 Comment
వాళ్లు మన ఉత్పత్తులను బ్యాన్ చేసీ , మన వాళ్ళను ఉద్యోగాల్లోంచి తీసేస్తుంటే మన ఉప రాష్ట్ర పతి ఈ పని చెయ్యడం ఏమైనా బాగుందా ?
https://twitter.com/sidhant/status/1533823170716659712?s=20&t=3Eg8yxIT6ya7MNm1_bmD0A
శ్రీమతి నూపుర్ శర్మ గారిని యాంఖర్ రెచ్చగొడితే ఆవిడ వ్యాఖ్య చేశారు . రెచ్చగొట్టిన యాంఖర్ మీద యే చర్యా లేదా ??
అదీ కాకుండా శ్రీమతి నూపుర్ శర్మ గారు తప్పు ఏమీ చెప్పలేదే సత్యాన్నే ప్రకటించారు .
మన ప్రభుత్వం కన్నా మన ఎంపీలు కన్నా విదేశీయుడైనా ఈ విదేశీ ఎంపీ గారు వేల రెట్లు నయం .
ఆయన ఏమన్నారో చూడండి .
https://youtu.be/JXlGgfLJV9A