రాష్ట్రపతి పదవి దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్రపతిని దేశపు మొదటి పౌరునిగా భావిస్తారు. అటువంటి అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలలో దేశంలోని పార్లమెంట్, శాసన సభల సభ్యులు అందరికి ఓట్ ఉంటుంది.
ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపిలు, ఎమ్మెల్యే (ఓటర్లు)ల్లో 43 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఇడబ్ల్యు) పేర్కొన్నాయి. 28 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా 4,809 మంది ఎంపిలు, ఎమ్మెల్యేల్లో 4,759 మంది ఎంపిలు, ఎమ్మెల్యేల నేర చరిత్ర, ఆస్తుల వివరాలు పరిశీలించి నివేదిక రూపొందించారు. నేర చరిత్రలో తొలిస్థానంలో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపి డిన్ కురియాకోజ్ ఉండగా, ఐదో స్థానంలో తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నారని పేర్కొంది.
2,030 ఎంపిలు, ఎమ్మెల్యేలు (43 శాతం)పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 236 (44 శాతం) మంది లోక్‌సభ సభ్యులు, 71 మంది (31 శాతం) రాజ్యసభ సభ్యులుగాను, 1,723 (43 శాతం) మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. 1,316(28 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 61 మంది హత్య కేసులున్నాయి. 223 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో
ఆంధ్రప్రదేశ్‌లో 175 ఎమ్మెల్యేలకు గానూ 174 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పతమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమై.. కాశ్మీర్లో ముగియనుంది. రిశీలించగా 95 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 54 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేల్లో 72 మంది క్రిమినల్ కేసులు, 47 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
టిడిపిలో 12 మంది ఎంపి, ఎమ్మెల్యేలపైన క్రిమినల్ కేసులు, ఐదుగురుపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వైసిపిలో 98 మంది ఎంపి, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, 60 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. టిఆర్ఎస్లో 54 మంది ఎంపి, ఎమ్మెల్యేలు క్రిమినల్, 36 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
37 తీవ్రమైన క్రిమినల్ కేసులు సహా 204 కేసులతో కేరళ ఇడుక్కి నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపి డీన్ కురియాకోజ్ క్రిమినల్ కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నారు. ఐదో స్థానంలో 37 తీవ్రమైన కేసులు సహా 64 కేసులతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారు.
టాప్ 5 కోటీశ్వరులైన ఎంపిలు, ఎమ్మెల్యేల్లో తొలిస్థానంలో టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్ధసారధి మొత్తం ఆస్తులు రూ.5,300 కోట్లు. రెండోస్థానంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆస్తులు విలువ రూ.2,577 కోట్లు. ఐదో స్థానంలో టిడిపి ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ రూ.668 కోట్లు.
ఎంపిలు, ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్ల మేరకు 10,74,364 ఓటు విలువకు గానూ 9,04,289 (84 శాతం) ఓటు విలువ కోటీశ్వరులదే. 4,759 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలల్లో 477 (10 శాతం) మంది మహిళలు. మొత్తం 10,74,364 ఓట్లలో మహిళల ఓట్లు 1,30,304 (13 శాతం).
రాష్ట్రపతి అభ్యర్థుల వివరాలు
ద్రౌపది ముర్ము 2014లో ఒరిస్సాలోని రైరంగపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌ను అనుసరించి ఆమె మొత్తం ఆస్తి: రూ.2.08కోట్లు, అప్పులు: రూ.14 లక్షలు, క్రిమినల్ కేసులు : 3, చదువు: గ్రాడ్యుయేషన్. 2009 జార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ మేరకు యశ్వంత్ సిన్హా ఆస్తులు: రూ.3.65 కోట్లు, క్రిమినల్ కేసులు: 1, చదువు: పోస్టు గ్రాడ్యుయేషన్.