అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది.
దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది.
అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.
అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్‌మారన్.
కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ పోస్టులను దర్దు చేసినట్లయితే ద్వంద్వ నాయకత్వం నియమించిన జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏ విధంగా తమ పదవుల్లో కొనసాగుతారని ప్రశ్నించారు. జూన్ 23 న ప్రిసీడియం ఛైర్మన్‌కు సంబంధించిన తీర్మానం చేయడానికి ముందే ఓపీఎస్ ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి పోయారని తెలిపారు.
బైలాస్ ప్రకారం సమావేశం నిర్వహణకు కో ఆర్డినేటర్ అవసరమని పేర్కొన్నారు. ఈ వాదనలను ఎడపాడి పళనిస్వామి (ఇపిఎస్) తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. తాత్కాలిక జనరల్ సెక్రటరీ గా ఈపీఎస్‌కు 2500 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారని తెలిపారు. నాలుగు నెలల్లోగా ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.
కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్‌మారన్.