నీతివంతమైన పరిపాలనకు నిధుల సమీకరణలో పారదర్శకత అత్యంత అవసరం. అయితే మన రాజకీయ పార్టీలు బయటకు వెల్లడింపలేని వర్గాల నుండి భారీగా `గుప్త విరాళాలు’ పొందుతున్నాయి. స్వయంగా తాము తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వర్గాల నుంచి మన జాతీయ పార్టీలు రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయి.
2004-05 నుంచి 2020-21 మధ్యకాలంలో ఈ వసూళ్లు జరిగాయని ఎన్నికల నిఘా సంస్థ విశ్లేషించింది. 2020-21లో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు గుర్తుతెలియని సంస్థల నుంచి విరాళాల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.690.67కోట్లుగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడీఆర్) వెల్లడించింది. ఎనిమిది రాజకీయ పార్టీలు, ఇరవై ఏడు ప్రాంతీయ పార్టీల వసూళ్లను ఎడిఆర్ పరిగణనలోకి తీసుకుంది.
జాతీయ రాజకీయ పార్టీల్లో కేంద్రంలోని అధికార భారతీయ జనతాపార్టీ (బిజెపి)తోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఎం), కమ్యూనిస్ట్ ఆఫ్ (సిపిఐ), నేషనలిస్ట్ కాంగ్రెస్ సమాజ్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి.
అదేవిధంగా ప్రాంతీయ పార్టీల్లో ఎఎపి, ఎజిపి, ఎఐఎడిఎంకె, ఎఐఎఫ్‌బి, ఎఐఎంఐఎం, ఎఐయుడిఎఫ్, బిజెడి, సిపిఐ (ఎల్), డిఎండికె, జిఎఫ్‌పి, జెడిఎస్, జెడియు, కెసిఎం, ఎంఎన్ఎస్, ఎన్‌డిపిపి, ఎన్‌పిఎఫ్, పిఎంకె, శివసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నాయి. రాజకీయపార్టీలు దాఖలు చేసిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదుట దాఖలు చేసిన విరాళాల స్టేట్మెంట్ ఆధారంగా ఎడిఆర్ విశ్లేషించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో 8 రాజకీయ పార్టీలు రూ.426.74 కోట్ల ఆదాయాన్ని గుర్తుతెలియని వర్గాల నుంచి పొందినట్లు ప్రకటించాయి. మరోవైపు 27 రాజకీయ పార్టీలు రూ.263.928కోట్లు ఆదాయాన్ని పొందినట్లు తెలిపాయి.
2020-21 ఆర్థిక సంవత్సరంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రూ.178.782 కోట్లు విరాళంగా వచ్చినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం (రూ.426.742 కోట్లు)లో ఇది 41.81 శాతం. ఇదే ఏడాదిలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రూ.100.502 కోట్లు ఆదాయంగా వచ్చినట్లు బిజెపి తెలిపింది. ఈ మొత్తం 23.55శాతంగా తెలిపింది.
ప్రాంతీయపార్టీల్లో టాప్ 5లో ఉన్న పార్టీలను పరిశీలిస్తే ఎపికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ 96 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. వైసిపి తర్వాత డిఎంకె రూ 80 కోట్లు, బిజెడి రూ 67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.773కోట్లు, ఆప్ రూ.5.4కోట్లుతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొందిన ఆదాయంగా పేర్కొన్న మొత్తం రూ.690.67కోట్లలో టాప్5 పార్టీల ఆదాయం రూ 325 కోట్లు, 47.06 శాతంగా ఉంది. 8 జాతీయ పార్టీలు రూ 74.46 కోట్లు పొందగా, 27 ప్రాంతీయ పార్టీలు రూ 250.60 కోట్లు పొందాయి.
మరోవైపు ఏడు పార్టీలు ఎఐటిసి, సిపిఐ, కెసిఎం, ఎఐయుడిఎఫ్ సమర్పించిన ఆడిట్, విరాళాల వివరాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని ఎడిఆర్ వెల్లడించింది.