బీహార్ లోని ఓ మంత్రిపై కిడ్నప్ కేసు నమోదు కావడంతో ముఖ్యమంత్రి ఆయన మంత్రిత్వ శాఖను మార్చారు. దానితో మంత్రి మాధవికే రాజీనామా చేశారు. పంజాబ్ లో స్పీకర్ తో పాటు మరో ఇద్దరు మంత్రులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
2014 నాటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జెడి నేత, బీహార్ మంత్రి కార్తీకేయ సింగ్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. కార్తీక్ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఆయన పదవి వీడక తప్పలేదు.
కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో బీహార్ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కార్తీక్‌ను తొలుత చక్కర శాఖకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్చారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో శాఖ మార్చిన కొద్దీ గంటలకే రాజీనామా చేశారు. కాగా, ఆయన రాజీనామాను ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది
పంజాబ్ లో ఓ కేసులో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంధ్వాన్, కేబినెట్ మంత్రులు గుర్మిత్ సింగ్ మీట్ హయ్యర్, లాల్జీత్ సింగ్ భుల్లార్ లకు పంజాబ్ కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
పంజాబ్ లోని సరిహద్దు జిల్లాలైన అమృత్ సర్, తరన్ తరన్ ప్రాంతాల్లో హుచ్ మృతుల సందర్భంగా స్పీకరు, ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ ధర్నాపై వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
మొదట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్తీకేయ సింగ్ కు న్యాయ శాఖ నుంచి మార్చి చక్కెర పరిశ్రమల మంత్రిత్వ శాఖను కేటాయించారు. మరో ఆర్జేడీ నేత అయిన షమీమ్ అహ్మద్ ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. కోర్టు మంత్రి కుమార్ కు అరెస్ట్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో అతన్ని న్యాయశాఖ నుంచి నితీష్ కుమార్ తప్పించారు.
బీహార్‌లో బిజెపి కూటమి నుండి వైదొలిగిన జెడియు అధినేత నితీష్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జెడితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. కొత్త మంత్రి వర్గ ఏర్పాటులో భాగంగా కార్తీక్‌కు న్యాయ శాఖను కేటాయించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కడంపై నితీష్ కుమార్‌పై బిజెపి విమర్శలు గుప్పించింది.