ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో అతిపెద్ద దేశంగా అవతరించిందని బ్లూమ్‌బర్గ్ తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంతకాలం ఈ స్థానంలో ఉన్న బ్రిటన్ను దాటేసిందని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిది సంస్థ (ఐఎంఎఫ్) నుంచి సేకరించిన జిడిపి గణంకాల ప్రకారం.. 2021 చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ టాప్-5 స్థానంలోకి వచ్చిందని పేర్కొంది.
ఆ త్రైమాసికంలో భారత జిడిపి 854.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.68.13 లక్షల కోట్లు)గా ఉండగా.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు (రూ.65.04 లక్షల కోట్లు)గా నమోదయ్యిందని తెలిపింది.
బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం పదేళ్ల క్రితం భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. భారత్ వేగంగా అభివఅద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. కాగా ఇరు దేశాల మధ్య జనాబా, తలసరి ఆదాయాలు, పేదరికం, మానవ వనరుల అభివృద్థి సూచీ, వైద్య సౌకర్యాల కల్పన అంశాలను పోల్చింది.
రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత ప్రాథమిక వ్యత్యాసాలలో జనాభా కీలకంగా ఉంది. 2022 నాటికి భారత్‌లో 141 కోట్ల మంది జనాభా ఉండగా.. బ్రిటన్ జనాభా 6.85 కోట్లు మాత్రమే. ఇది భారత జనాభా కంటే 20 రెట్లు ఎక్కువ. రెండు దేశాల జనాభా వ్యత్యాసం నేపథ్యంలో తలసరి జిడిపితో పోలిస్తే సగటు భారతీయుని ఆదాయం చాలా తక్కువ.
దీంతో దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేయవచ్చని తెలిపింది. 19వ శతాబ్దం ప్రారంభంలో భారత్‌తో పోలిస్తే అత్యంత పేదరికంలో ఉన్న బ్రిటన్ ఇపుడు మెరుగ్గానే ఉంది. అయితే పేదరికాన్ని అరికట్టడంలో బ్రిటన్ కంటే భారత్ మెరుగ్గాలేదు.” అని ఈ రిపోర్ట్ పేర్కొంది. 2021లో బ్రిటన్ పౌరుల తలసరి ఆదాయం 47,334 డాలర్లు (దాదాపు రూ.38 లక్షలు)గా ఉంది.
అదే భారతీయుల తలసరి ఆదాయం కేవలం రూ.91,000గా ఉంది. 2020 నాటితో పోల్చితే బ్రిటన్ పౌరుల ఆదాయం 15 శాతం పెరగ్గా భారతీయుల తలసరి ఆదాయంలో 7.5 శాతం మాత్రమే పెరుగుదల ఉంది.
”భారత స్థూల దేశీయోత్పత్తి గణంకాల్లో వేగవంతమైన వృద్థిని సూచిస్తున్నాయి. ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాలకు సంబంధించిన మానవ వనరుల సూచీలో మాత్రం 1980లో బ్రిటన్ ఉన్న స్థితికి భారతదేశం చేరుకోవాలన్నా కనీసం ఇంకా ఓ పదేళ్ల కాలం పట్టచ్చు” అని ఈ నివేదిక పేర్కొంది. అంటే బ్రిటన్ కంటే భారత్ కనీసం 50 ఏళ్లు వెనకబడి ఉందని స్పష్టమవుతోంది.